త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Palla Rajeshwar Reddy | ఈసారి వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తారా..? లేదా..? ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

Palla Rajeshwar Reddy | రాష్ట్రం నుంచి కేంద్రం కేవ‌లం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌ర‌కే వ‌రి ధాన్యం కొనుగోలు చేసేందుకు అంగీక‌రించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు.. ఈ నేప‌థ్యంలో ఈసారి వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తారా..? లేదా..? అని ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Mar 23, 2026, 11.24 am IST

Palla Rajeshwar Reddy | ఈసారి వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తారా..? లేదా..? ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి
Advertisement

Palla Rajeshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రం నుంచి కేంద్రం కేవ‌లం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌ర‌కే వ‌రి ధాన్యం కొనుగోలు చేసేందుకు అంగీక‌రించింద‌ని సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు.. ఈ నేప‌థ్యంలో ఈసారి వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తారా..? లేదా..? అని ప్ర‌భుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌పై ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు.

వ‌రి ధాన్యం సేక‌ర‌ణ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. నిన్న సీఎం మాట్లాడుతూ.. 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌కే కేంద్రం అంగీక‌రించింది.. కాబ‌ట్టి వ‌రి ధాన్యం వేసే విష‌యంలో రైతులు ఆలోచించుకోవాల‌ని సీఎం చెప్పారు. ఇక రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం సేక‌ర‌ణ చేశామ‌ని చెబుతున్నారు. మీ వెబ్‌సైట్‌లో ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. 2014-15లో 24 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొనుగోలు చేశారు. 2019-20లో 111 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు, 2020-21లో 141 ల‌క్ష‌లు, 2021-22లో 120 ల‌క్ష‌లు, 2022-23లో 131 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ప్రోక్యూర్ చేసింది. ఇక 2023-24లో రెండు సీజ‌న్ల‌కు క‌లిసి 95.31 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించారు. 2024-25లో 100.31 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించారు. మ‌రి గ‌త ప్ర‌భుత్వం కంటే ఎక్కువ వ‌రి ధాన్యం ఎక్క‌డ కొనుగోలు చేశారో చెప్పాలి. ప్ర‌తిసారి రికార్డు స్థాయిలో సేక‌ర‌ణ చేస్తే ఈ వెబ్‌సైట్‌లో కాకుండా.. ఇంకెక్క‌డైనా వివ‌రాలు పెడుతున్నారా..? అనే దానిపై మంత్రి స‌మాధానం చెప్పాల‌ని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి డిమాడ్ చేశారు.

50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు ఒక్క సీజ‌న్‌కా లేక‌ రెండు సీజ‌న్ల‌కా అనే దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వాలి. 70 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు గ‌తంలో తీసుకున్నారు కాబ‌ట్టి ఈ సీజ‌న్‌లో వ‌రి ధాన్యం తీసుకుంటారా లేదా స‌మాధానం చెప్పాలి. కొనుగోలు కేంద్రాలు పెడుతారా..? లేదా..? మేం మొత్తుకుంటే మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టారు. వ‌రి తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయితే కేంద్రాలు ప్రారంభించాలి. దొడ్డు వ‌డ్ల‌కు కూడా బోన‌స్ ఇస్తామ‌న్నారు. కానీ బోన‌స్ స‌న్న‌వ‌డ్ల‌కే ఇస్తున్నారు. దీంట్లో కూడా గ‌త యాసంగిలో 1208 కోట్లు బకాయిలు ఉన్నాయ‌ని రైతులు అంటున్నారు. ఒక వేళ ఆ బ‌కాయిలు ఉంటే ఎప్ప‌టి లోపు చెల్లిస్తారో చెప్పాల‌ని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మంత్రిని డిమాండ్ చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement