Padi Kaushik Reddy | పోలీసులకు క్షమాపణలు చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి.. కారణమిదే..?
Padi Kaushik Reddy | కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క- సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకొని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..?
కరీంనగర్ జిల్లా వీణవంక(కౌశిక్ రెడ్డి స్వగ్రామం) లో సమ్మక్క సారలమ్మ జాతర వెళ్లేందుకు సిద్ధమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు నిర్బంధించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కేసీక్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో బయలుదేరేందుకు తన కారు వద్దకు రాగానే పోలీసులు వచ్చి అడ్డుకున్నారు.
తనను ఎందుకు వెళ్లనివ్వడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించగా, వీణవంక జాతరకు వెళ్లొద్దనే ఆదేశాలు ఉన్నాయని పోలీసులు చెప్పడంతో కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్‌ని ముందుకు వెళ్లనీయకపోవడంతో ఎమ్మెల్యే తన సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖ రెడ్డితో కలిసి కరీంనగర్-వరంగల్ రహదారిపై బైఠాయించారు. ఒకరిద్దరు కార్యకర్తలను పోలీసులు బలవంతం వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నం చేయగా, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు సభ్యుడిగా గెలువని ఓ అనామకుడికి సీపీ, ఏసీపీలు గులాంగిరీ చేయడమేమిటని ప్రశ్నించారు. అధికారం చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
హుజూరాబాద్‌లో నిర్బంధం, ఆందోళనల తర్వా త సాయంత్రం ఎమ్మెల్యే జాతర వెళ్లేందుకు పోలీసులు అనుమతించగా, కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక వెళ్లారు. స్థానిక సర్పంచ్ దాసారపు సరోజనతో కలిసి సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నారు. అమ్మవారి వద్ద కొబ్బరికాయ కొట్టనివ్వకుండా పేద దళిత మహిళా సర్పంచ్‌ను అడ్డుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అనంతరం గద్దెల వద్ద నుంచి కిందికి దిగాలని ఎమ్మెల్యేతోపాటు సర్పంచ్‌కు హుజూరాబాద్ ఏసీపీ మాధవి సూచించగా, వారు దిగకపోవడంతో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి సైదాపూర్ ఠాణాకు తరలించారు. కాగా, ఎమ్మెల్యే సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనిఖను ఏసీపీ మాధవి పోలీసులతో కలిసి అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు.
https://x.com/i/status/2017211474901713202
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






