త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | అటువంటి ఫాల్త్ రాజ‌కీయ నాయ‌కుడిని కాదు : బండి సంజ‌య్

Bandi Sanjay | కొత్త పార్టీ పెట్టాల‌నే ఫాల్త్ ఆలోచ‌న‌లు నాకు రావు.. అటువంటి ఫాల్త్ రాజ‌కీయ నాయ‌కుడిని కాదు అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ తేల్చిచెప్పారు. బండి సంజ‌య్ కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై బండి సంజ‌య్ తీవ్రంగా స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On May 20, 2026, 3.44 pm IST

Bandi Sanjay | అటువంటి ఫాల్త్ రాజ‌కీయ నాయ‌కుడిని కాదు : బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : కొత్త పార్టీ పెట్టాల‌నే ఫాల్త్ ఆలోచ‌న‌లు నాకు రావు.. అటువంటి ఫాల్త్ రాజ‌కీయ నాయ‌కుడిని కాదు అని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ తేల్చిచెప్పారు. బండి సంజ‌య్ కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై బండి సంజ‌య్ తీవ్రంగా స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు.. ఆయ‌న మాట‌ల్లోనే..

'నేనేందో మీకు తెలుసు.. భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు తెలుసు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలుసు.. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తెలుసు. కొత్త పార్టీ పెట్టాల‌నే ఫాల్త్ ఆలోచ‌న‌లు నాకు రావు. అటువంటి ఫాల్త్ రాజ‌కీయ నాయ‌కుడిని కాదు. అనేక శిక్ష‌ణా శిబిరాల్లో.. భార‌తీయ జ‌న‌తా పార్టీ అంత‌ర్గ‌త శిక్ష‌ణా శిబిరాల్లో అనేక మంది కార్య‌క‌ర్త‌ల‌ను త‌యారు చేసిన‌టువంటి నాయ‌కులం, కార్య‌క‌ర్త‌లం మేం. క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేసే భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త కోరుకునేది ఒక‌టే చివ‌రి కోరిక‌.. ఉరిశిక్ష వేసేముందు చివ‌రి కోరిక ఏంటి అని అడుగుతార‌ట‌. వాళ్లేం చెప్త‌రో తెల్వ‌ది. కానీ క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేసే భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ను మీరు పిలిచి అడిగితే ట‌క్కుమ‌ని చెప్పేది ఒక్క‌టే.. నేను చ‌నిపోయాక బీజేపీ కండువా జెండా క‌ప్పాల‌ని అంట‌రు. దీన్ని క‌మిట్‌మెంట్ అంట‌రు. అటువంటి క‌మిట్‌మెంట్ గ‌ల కార్య‌క‌ర్త‌ను నేను. మీకు తెల్వ‌దా.. ఎవ‌రో రాస్తుంట‌రు.. ఏదో చేస్తుంటరు.. కాబ‌ట్టి దాన్ని గురించి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ప‌ట్టించుకోను కూడా నేను' అని సంజయ్ పేర్కొన్నారు.

అందుకే నీవు రెచ్చిపోతున్నావ్ కేసీఆర్..

'కేసీఆర్ చేతిలో 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ ద‌యాదాక్షిణ్యాల మీద మోదీ ప్ర‌భుత్వం న‌డుస్తుంది పాపం. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూర్చొని బండి సంజ‌య్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేస్త‌రు అంటే నీకు ఒక ఎంపీ లేడు. బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి అంట‌వు.. ఎందుకంటే నీ గ‌డిల పాల‌న‌ను బ‌ద్ద‌లు కొట్టింది మేమే. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించింది మేమే. నీ కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకంగా కొట్లాడింది మేమే. అందుకే నీకు స‌హ‌జంగానే ఉంట‌ది.. నీకు 17 మంది ఎంపీలు ఉన్నారు క‌దా.. అందుకే నీవు రెచ్చిపోతున్నావ్' అని బండి మండిప‌డ్డారు.

క‌న్న‌కొడుకును తీసుకెళ్లి విచార‌ణ‌కు అప్ప‌జెప్పినా..

'కోర్టు ప‌రిధిలో ఉంది.. క‌న్న‌కొడుకును ఓ తండ్రి పోలీసుల‌కు స్వ‌యంగా అప్ప‌గించిన‌టువంటి సంద‌ర్భం ఏదైనా ఉందా..? ఇవాళ క‌న్న కొడుకును నేను తీసుకెళ్లి విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని అప్ప‌జెప్పినా. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్ట‌రీ న‌డుపుతున్నాడు.. ఏం జ‌రుగుత‌ది.. ఏం జ‌ర‌గాలి.. ఏం జ‌రిపించాల‌నేది ఆ కుట్ర‌ల‌న్నీ ఆయ‌న్నే చేస్తున్న‌డు కాబ‌ట్టి ఆయ‌న‌ను అడిగితే స‌మాధానం చెప్త‌డు' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement