త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఇది గొంతెమ్మ కోరిక కాదు.. విదేశీ విద్యకు నిధులివ్వండి : కేటీఆర్

KTR | వివిధ దేశాల్లో చ‌దువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల‌కు త‌క్ష‌ణమే నిధులు విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది గొంతెమ్మ కోరిక కాదు అని కేటీఆర్ అన్నారు.

S

Telangana | Published On Mar 24, 2026, 12.29 pm IST

KTR | ఇది గొంతెమ్మ కోరిక కాదు.. విదేశీ విద్యకు నిధులివ్వండి : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : వివిధ దేశాల్లో చ‌దువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల‌కు త‌క్ష‌ణమే నిధులు విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది గొంతెమ్మ కోరిక కాదు అని కేటీఆర్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కేటీఆర్ విదేశీ విద్యా ప‌థ‌కంపై ప్ర‌స్తావించారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో ఆనాడు తొమ్మిదేండ్ల కాలంలో 7 వేల మంది విద్యార్థుల‌కు వివిధ రూపాల్లో విదేశీ విద్య‌కు అవ‌కాశం క‌ల్పించాం. మ‌హాత్మా జ్యోతి బాఫూలే స్కీం కింద‌, అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ కింద‌, మౌలానా అబుల్ క‌లాం ఆజాద్ స్కీం కింద‌, స్వామి వివేకానంద పథ‌కం కింద ప్ర‌తి విద్యార్థికి రూ. 20 ల‌క్ష‌ల చొప్పున స్కాల‌ర్‌షిప్‌లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆ నిధులు ఆగిపోయాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

దాదాపు 2025 అక్టోబ‌ర్‌లో రూ. 303 కోట్లు విడుద‌ల చేస్తామ‌ని చెప్పి విడుద‌ల చేయ‌లేదు. 2500 మంది విద్యార్థులు ఫీజుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫ‌స్ట్ సెమిస్ట‌ర్ ఫీజు క‌ట్టి, సెకండ్ సెమిస్ట‌ర్ ఫీజులు క‌ట్ట‌లేక లండ‌న్, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లో ఉన్న విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇది టాప్ ప్రియ‌ర్టీ కింద తీసుకుని గ్రీన్ చానెల్ పెడితే లాభం జ‌రుగుతంది. ఇది గంతెమ్మ కోరిక కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు

టెన్త్ పాసైతే రూ. 10 వేలు, ఇంట‌ర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే రూ. 25 వేలు ఇస్తామ‌న్నారు. ఇది కూడా గుర్తు చేస్తున్నాం. అన్న‌వ‌స్త్రం కోసం పోతే ఉన్నవ‌స్త్రం పోయిన‌ట్టు పిల్ల‌ల ప‌రిస్థితి త‌యారైంది. వెంట‌నే విదేశీ విద్యా ప‌థ‌కానికి నిధులు మంజూరు చేసి.. వారిని ఆదుకోండి.. వారి విద్య ఆగ‌కుండా చూడండి అని ప్ర‌భుత్వానికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement