KTR | ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే..! : కేటీఆర్
KTR | ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు. లేని కేసు ఉన్నట్టుగా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు.. 100 శాతం ఇది లొట్టపీసు కేసే.. మొదట్నుంచి నేను ఇదే చెబుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగం జరగలేదు
ఫార్ములా ఈరేస్ వల్ల రూ. 700 కోట్ల పెట్టుబడులు
మెస్సీతో సీఎం ఫుట్‌బాల్ ఆటకు రూ. 100 కోట్ల ఖర్చు
టీడీఆర్ అతిపెద్ద కుంభకోణం
అసెంబ్లీ సీట్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నాం
రాజగోపాల్ రెడ్డితో సరదా సంభాషణే
KTR | త్రినేత్ర.న్యూస్ : ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగలేదు. లేని కేసు ఉన్నట్టుగా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు.. 100 శాతం ఇది లొట్టపీసు కేసే.. మొదట్నుంచి నేను ఇదే చెబుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్ చాట్ చేసిన సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
ఆరు గ్యారెంటీలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు నుండి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఫార్ములా ఈ రేస్ కేసు తెరపైకి తెచ్చారు. అది ముమ్మాటికి లొట్టపీసు కేసే, ఎక్కడా క్విడ్ ప్రో కో జరగలేదు. నగదు బ్యాంక్ టు బ్యాంక్ బదిలీ జరిగింది, డబ్బులు ఇంకా ఆ కంపెనీ దగ్గరే ఉన్నాయి, ఛార్జ్ షీట్లో ఆ కంపెనీ పేరు ఎందుకు లేదు? మేము నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వల్ల 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మెస్సీతో ముఖ్యమంత్రి ఫుట్ బాల్ ఆటకు వంద కోట్ల ఖర్చు అయింది. ముఖ్యమంత్రి నుంచి రికవరీ చేస్తారా. రేవంత్ రెడ్డి 200 కోట్లు ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీలు పెడితే, ప్రపంచం ముందు మన తెలంగాణ పరువు పోయింది. నన్ను వేశ్య లాగా చూశారని మిల్లా మ్యాగీ ఇంటర్వ్యూలో చెబితే, దాని మీద ఎలాంటి విచారణ లేదు. అక్రమ కేసులకు మేము భయపడం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మాకు న్యాయం జరుగుతుంది. అన్నీ నా నిర్ణయాల ప్రకారమే జరిగాయని చెప్తున్నాను కదా, అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
టీడీఆర్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణం
మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాదు.. ప్రజల వద్ద పెట్టండి. భయం ఉంటే వెయ్యి మంది పోలీసులను పెట్టుకొని రండి. టీడీఆర్ అతి పెద్ద స్కాం. కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. టీడీఆర్‌లను రేవంత్ కుటుంబ సభ్యులు ఏటీఎంలా మార్చుకున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులే టీడీఆర్‌లు కొంటున్నారు. ఇదొక ఇన్ సైడర్ ట్రేడింగ్ కుంభకోణం. మా ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తాం. మూసీ బాధితులకు టీడీఆర్‌లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ అన్నారు.
అసెంబ్లీ సీట్లు పెంచటాన్ని స్వాగతిస్తున్నాం..
అసెంబ్లీ సీట్లు పెంచటాన్ని స్వాగతిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గించే ప్రయత్నం చేయవద్దు. డీలిమిటేషన్ ఎప్పుడో జరగాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. ఏపీ విభజన చట్టంలోనే నియోజకవర్గ పునర్విభజన హామీ ఉంది. పార్లమెంట్‌లో దక్షిణాదికి 24 శాతం ప్రాతినిధ్యం ఉంది. దానిని యథావిధిగా కొనసాగించాలి. కేంద్రం దక్షిణానికి అన్యాయం చేస్తుందని నేను అనుకోను. దక్షిణాది కుటుంబ నియంత్రణను బాగా పాటించింది. కుటుంబ నియంత్రణ పాటించని వారికి నజరానా.. పాటించిన వారికి జరిమానా అంటే కుదురదు. ఆలాంటి తప్పు ప్రభుత్వం చేస్తుందని అనుకోను. డీలిమిటేషన్ జరిగితే ప్రజలకు సేవ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డితో ఒంటరిగా కూర్చోలేదు..
మహిళలకు రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలపై సీతక్క అవాస్తవాలు చెబుతోంది. సీతక్క రాజీనామా చేస్తారా? భట్టి రాజీనామా చేస్తారా? తేల్చుకోవాలి. చేతనైతే నా మీద చర్యలు తీసుకోవాలి. అధికారుల మీద కాదు. రాజగోపాల్ రెడ్డితో ఒంటరిగా కూర్చోలేదు. ఏడెనిమిది మంది కూర్చొని మాట్లాడుకున్నాం. అందరం సరదాగా సంభాషించామని కేటీఆర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



