KTR | మల్లారెడ్డి అమాయకుడే.. సభలో నవ్వులు పూయించిన కేటీఆర్
KTR | అమాయకుడైన ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కూడా కేసులు పెట్టారని చెబుతూ.. శాసనసభలో ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వులు పూయించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : అమాయకుడైన ఎమ్మెల్యే మల్లారెడ్డి మీద కూడా కేసులు పెట్టారని చెబుతూ.. శాసనసభలో ఎమ్మెల్యే కేటీఆర్ నవ్వులు పూయించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చమని సీఎం రేవంత్ పిలుపునిస్తున్నారు. ఇలా హింసను ప్రేరేపించడం సరికాదు. ఇలాంటి కల్చర్ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. మా నాయకుల మీద దాడులు చేస్తున్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, బాల్క సుమన్‌పై దాడి చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చేయని తప్పుకు బాల్క సుమన్‌ను జైల్లో పెట్టారు. సుంకె రవిశంకర్ ఇంటి మీద దాడి, జనగామలో పల్లారాజేశ్వర్ రెడ్డి మీద, కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడులతో పాటు హరీశ్‌రావు, సూర్యాపేట ఎమ్మెల్యే, నా క్యాంపు ఆఫీసు మీద దాడి చేశారు. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మీద దాడులు చేశారని కేటీఆర్ తెలిపారు.
మీ నాయకులు బట్టలూడదీసి కొడుతామన్న కేసులు పెట్టరు. కానీ అమాయకుడైన మల్లారెడ్డి.. 50వ పెళ్లి వార్షికోత్సవం చేసుకుంటున్నారు.. పాపం ఆయన మీద కూడా కేసులు పెట్టారు. మణుగూరు, భువనగిరిలో మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. హింస రాజకీయానికి తెలంగాణలో తావు లేదు. నూతనకల్ మండలంలో మా నాయకుడిని హత్య చేశారు. ఒకాయనకు మూత్రం తాగించారు. ఇది పద్ధతి కాదు.. కొత్తగా ఈ సంస్కృతి తీసుకురావొద్దు అని కేటీఆర్ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



