KTR vs Adi Srinivas | కేటీఆర్ వర్సెస్ ఆది శ్రీనివాస్.. సభలో ఆ పదాలపై తీవ్ర వాగ్వాదం
KTR vs Adi Srinivas | తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ పార్లమెంటరీ భాష వినియోగించారన్న ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR vs Adi Srinivas | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ పార్లమెంటరీ భాష వినియోగించారన్న ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు స్పీకర్ జోక్యం చేసుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం సద్దుమణిగింది.
అనర్హత పిటిషన్లపై సభలో చర్చకు ఆస్కారం లేదని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పష్టత ఇచ్చిన అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు.
నిన్నటి రోజున గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కొన్ని పదాలు అన్ పార్లమెంటరీగా మాట్లాడారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపైన చేసిన భాష అన్ పార్లమెంటరీగా ఉందని గమనించాం. పదేండ్లు మంత్రిగా ఉన్నారు. అనుభవం ఉన్న వారు. ఆయన మాటల్లో ఈర్ష్య భావం కనిపించింది. సీఎం అంటే కడుపు మంట కనిపించింది. పదాలు అన్ పార్లమెంటరీగా ఉన్నాయి. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నా. ఇలాంటి పదాలు వాడడం దారుణం. మీరు పరిశీలించి రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నామని ఆది శ్రీనివాస్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. నేను మాట్లాడిన దాంట్లో ఏం అన్ పార్లమెంటరీ భాష ఉందో కోట్ చేయలేదు. ఒక వేళ నేను అన్ పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే మీరు అప్పుడే ఆపేవారు. ఆ పదాలను తొలగించాల్సిన అవసరం ఉందని అనుకోవడం లేదు. అనకూడని మాటలు అన్నానా..? బడవే, బలి దేవత అన్నానా..? నేనేం అలా అనంలేదు. సీఎం అన్నది నేను చెబుతున్నా. సీఎం మాట్లాడింది రికార్డుల్లో ఉంటే నేను మాట్లాడింది కూడా రికార్డుల్లో ఉండాలి. ఇక ఇది రాజ్యాంగ పరిధిలో పని చేసే శాసనసభ. శాసనసాలు చేసే సభ ఇది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద ఇదే సభలో ఎన్నో చర్చించాం. బీసీ రిజర్వేషన్లపై కూడా చర్చించాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే. మంత్రి పదవి కావాలంటే పైరవీ చేసుకోమనండి(ఆది శ్రీనివాస్‌ను ఉద్దేశించి). అనర్హత పిటిషన్ల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా పార్టీ మారితే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫికేషన్ అవుతారని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటను గుర్తు చేశాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని.. సభలో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నాం. మీరు కూడా అడ్డగోలుగా బయట మాట్లాడారు. వారు మాట్లాడిన మాటలు మర్యాద పూర్వకంగా లేవు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ వైపు కూడా చూస్తున్నారు. మీరు మాట్లాడే పద్ధతి బాగా లేదు. తీవ్రంగా ఖండించదగిన విషయం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
చివరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కల్పించుకుని.. అధికార, ప్రతిపక్ష సభ్యులను నిలువరించారు. కేటీఆర్ మాటలను పరిశీలించి రికార్డుల నుంచి తొలగించబడును అని స్పీకర్ ప్రకటించారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



