త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Jagadish Reddy | మ‌ధు హ‌త్య ముమ్మూటికీ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌త్యే : ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి

MLA Jagadish Reddy | సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మ‌ధు హ‌త్య పోలీసు అధికారుల‌కు తెలిసే జ‌రిగింద‌ని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు.

S

Telangana | Published On May 23, 2026, 3.08 pm IST

MLA Jagadish Reddy | మ‌ధు హ‌త్య ముమ్మూటికీ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌త్యే :  ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి
Advertisement

MLA Jagadish Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత మ‌ధు హ‌త్య పోలీసు అధికారుల‌కు తెలిసే జ‌రిగింద‌ని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్ర‌భుత్వ హత్యే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు. మ‌ధు మృత‌దేహానికి జ‌గ‌దీశ్ రెడ్డి నివాళుల‌ర్పించి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అధికారి స్వయంగా బీఆర్ఎస్ నాయకుడిని పిలిచి నువ్వు ఎగిరిపోతావ్ అని బెదిరించాడు. 2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న మధును కాంగ్రెస్ నాయకులు అనేక సార్లు బెదిరించారు. ఈ హత్య పోలీస్ అధికారులకు తెలిసే జరిగింది, అందుకే మధును ముందే హెచ్చరించారు. పోలీస్ వాళ్లు బెదిరిస్తున్నారు అని చెప్తే జాగ్రత్తగా ఉండు అని చెప్పాను. కానీ ఏదో పంచాయితీ ఉందని పిలిచి మధును హత్య చేశారని జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ గూండాల చేతుల్లోనే పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూర్యాపేటలో పోలీసుల తీరు అత్యంత దుర్మార్గంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారు. కేసులో ట్రయల్ నడుస్తున్న క్రమంలో మధుతో పాటు ఇతర సాక్షులను భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు. మధును కిరాతకంగా హత్య చేసిండ్రు, మధూది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని జ‌గ‌దీశ్ రెడ్డి పేర్కొన్నారు.

మధు కుంటుంబ పోషణ బాధ్యత, పిల్లల చదువుల బాధ్యత బీఆర్ఎస్ పార్టీనే తీసుకుంటుంది. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా మేము గమనిస్తూనే ఉంటాము.. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడు. ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా ఓపెన్ చేసి బాధ్యులైన వాళ్ల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. తప్పు చేస్తే ఐజీ, డీజీ స్థాయి అధికారులను కూడా వదలలేదు.. అది దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు విచారణ చేయాలని జ‌గ‌దీశ్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement