Bollam Mallaiah Yadav | వీధి రౌడీలా సీఎం రేవంత్ మాటలు.. నిప్పులు చెరిగిన బొల్లం మల్లయ్య యాదవ్
Bollam Mallaiah Yadav | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
Bollam Mallaiah Yadav | త్రినేత్ర.న్యూస్ : రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా వీధి రౌడీలా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఒక తుగ్లక్‌లా ప్రవర్తిస్తూ.. హింసను ప్రేరేపించే నరహంతక భాషను వాడుతూ ప్రజలను, విపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రైతుల కోసం కన్నెపల్లి పంపులను ఆన్ చేయమంటే... ప్రతిపక్షాల గొంతులు కోస్తామంటూ రేవంత్ రెడ్డి ఉన్మాద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇంతటి క్రూరమైన, అహంకారపూరిత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేడు. నోటికొచ్చినట్లు వాగుతూ... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న రేవంత్ రెడ్డిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
నీచమైన వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు
తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహానీయుడు మా కేసీఆర్.. ఆయనపై రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. వర్షాలు లేక, సాగునీరు అందక చేతికొచ్చిన నారుమడులన్నీ కళ్లముందే ఎండిపోతుంటే రైతులు లబోదిబోమంటున్నారు. ఈ చేతకాని తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి.. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
జులై 12, 2026

Ramchander Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగునీటికి కరువు : బీజేపీ చీఫ్ రామచందర్ రావు
జులై 12, 2026

KTR | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ..! సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 12, 2026
తాజావార్తలు
- ●Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు
- ●DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే
- ●MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
- ●Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ
- ●Argentina vs Switzerland | ఎక్స్ట్రా టైమ్‌లో విశ్వరూపం: స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా!
- ●Trekking in Ananthagiri | అనంతగిరి ట్రెక్కింగ్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన టీచర్ మృతి

Parliament All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పీఎం, సీఎంల పదవులు ఊడే కొత్త బిల్లు

DMK vs TVK | కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది.. సీఎం విజయ్‌తో రాజీ లేదు: భగ్గుమన్న డీఎంకే

MLA Jagadish Reddy | భద్రాచలం మునిగిపోతుందా..? చర్చకు సిద్ధమా ఉత్తమ్ కుమార్ రెడ్డి..? : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

Sai Pallavi | 25 కోట్ల బడ్జెట్ - ఐదు కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ



