త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | స‌రూర్‌న‌గ‌ర్‌లో సంగ్రామ స‌ద‌స్సు.. బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధం

BRS | కాంగ్రెస్ పార్టీ (Congress) ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా నిరుద్యోగుల‌కు మోసం చేసిందంటూ బీఆర్ఎస్ (BRS) పార్టీ హైద‌రాబాద్ స‌రూర్‌న‌గ‌ర్‌లో యువ సంగ్రామ స‌ద‌స్సు (Yuva Sangrama Sadassu) నిర్వ‌హిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఆ పార్టీ నాయ‌కుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టులు (House Arrest) చేస్తున్నారు.

G

Telangana | Published On Jul 18, 2026, 9.28 am IST

BRS | స‌రూర్‌న‌గ‌ర్‌లో సంగ్రామ స‌ద‌స్సు.. బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధం
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ పార్టీ (Congress) ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుండా నిరుద్యోగుల‌ను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ (BRS) పార్టీ హైద‌రాబాద్ స‌రూర్‌న‌గ‌ర్‌లో యువ సంగ్రామ స‌ద‌స్సు (Yuva Sangrama Sadassu) నిర్వ‌హిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఆ పార్టీ నాయ‌కుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టులు (House Arrest) చేస్తున్నారు. స‌ద‌స్సుకు హాజ‌రుకాకుండా మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ను (RS Praveen Kumar) గృహ‌నిర్బంధం చేశారు. హైకోర్టు (High Court) అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ యువ సంగ్రామ స‌ద‌స్సుకు హాజ‌రుకాకుండా త‌మ‌ను గృహ‌నిర్బంధం చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

నిరుద్యోగ యువత తరఫున బీఆర్ఎస్ గళమెత్తితే ఇంత భయమెందుకని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్ఎస్‌ ప్ర‌వీణ్ కుమార్ ప్ర‌శ్నించారు. హైకోర్టు అనుమ‌తి ఉన్నా, మల్కాజిగిరి సీపీ స్వయంగా యువ సంగ్రామ సదస్సుకు అనుమతినిచ్చినా బీఆర్ఎస్ నాయకులను వెళ్లనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దారుణమ‌ని చెప్పారు. ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని పెద్ద పెద్ద నీతులు చెబుతుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పౌరుల రాజ్యాంగ హక్కులను నిస్సిగ్గుగా కాలరాస్తున్నాడని మండిప‌డ్డారు. త‌న‌ను ప్రజాస్వామ్యబద్ధంగా యువ సంగ్రామ సదస్సుకు హాజరవ్వకుండా అడ్డుకుంటే, ప్రభుత్వ అణచివేతకు నిరసనగా ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ నాయ‌కుల అక్ర‌మ అరెస్టుల‌ను ఎమ్మెల్సీ శంభీపూర్ ఖండించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్‌ని సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడంపై మండిప‌డ్డారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల పట్ల గౌరవానికి విరుద్ధమ‌ని చెప్పారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమ‌న్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే.

యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఇటువంటి నిరంకుశ ధోరణిని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలి. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement