BRS | సిద్దిపేటకు ఏం చేశారని వస్తున్నారు? అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరు.. రేవంత్‌పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
BRS | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని మండిపడుతున్నారు.
BRS | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని మండిపడుతున్నారు. సిద్దిపేటకు ఇంత భయంతో ఎందుకు వస్తున్నారని ముఖ్యమంత్రిని (Revanth Reddy) ప్రశ్నించారు. నగరంలో ఎక్కడ చూసినా అడుగడుగునా పోలీసులను మోహరించారని, వేలాది మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ప్రజలు నిలదీస్తారనే భయమా? అని నిలదీశారు. మూడేండ్ల పాలనలో సిద్దిపేటకు (Siddipet) ఏం చేశారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో మధ్యంతరంగా ఆగిపోయిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..
- సిద్దిపేట కలెక్టరేట్ పక్కనే ఉన్న వెటర్నరీ కళాశాల పరిస్థితి ఏమిటి?
- కోమటి చెరువు పక్కన ఉన్న శిల్పారామం పనులు ఎందుకు నిలిచిపోయాయి?
- టూ టౌన్ పోలీస్ స్టేషన్ మార్గంలో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన నర్సింగ్ కళాశాల పనులు ఎప్పుడు పూర్తవుతాయి?
- గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోడ్లపై కనీసం ప్యాచ్‌వర్క్ పనులు కూడా చేయలేని అసమర్థ పాలనకు కారణం ఏమిటి?
- బీఆర్ఎస్ పాలనలో ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్దిపేట అభివృద్ధికి ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించింది?.. ఎన్ని నిధులు ఖర్చు చేసింది?
ఈ ప్రశ్నలకు సంబంధించిన ప్రజలకు ముఖ్యమంత్రి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను అర్ధరాత్రి ముందస్తు అరెస్టులు చేయించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరని, అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేరని హెచ్చరించారు.


ముఖ్యమంత్రి పర్యటనల పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం మానుకొని, సిద్దిపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






