త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురు మృతి

Vikarabad | వికారాబాద్ (Vikarabad) జిల్లా బుగ్గరామేశ్వ‌రం స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం బుగ్గ‌రామేశ్వ‌రం స‌మీపంలో మూల‌మ‌లుపు వ‌ద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ఎదురుగా వ‌స్తున్న ఆటోను ఢీకొట్టింది.

G

Telangana | Published On Nov 22, 2026, 12.09 pm IST

Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురు మృతి
Advertisement

Vikarabad | త్రినేత్ర న్యూస్‌: వికారాబాద్ (Vikarabad) జిల్లా బుగ్గరామేశ్వ‌రం స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం బుగ్గ‌రామేశ్వ‌రం స‌మీపంలో మూల‌మ‌లుపు వ‌ద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ఎదురుగా వ‌స్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

పెండ్లిమ‌డుగు (Pendlimadugu) గ్రామానికి చెందిన న‌లుగురు కేరెల్లికి ఆటోలో బ‌య‌ల్దేరారు. ఈ క్ర‌మంలో బుగ్గ‌రామేశ్వ‌రం (Bugga Rameshwaram) స‌మీపంలో ఎదురుగా వ‌చ్చిన లారీ.. వారి ఆటోను ఢీకొట్టింది. ప్ర‌మాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయింది. దీంతో అందులో ఉన్న న‌లుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద స్థ‌లాన్ని ప‌రిశీలించారు. మృతుల‌ను చంద్ర‌మ్మ‌, పార్వ‌త‌మ్మ‌, స‌రిత‌, నాగేశ్‌గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మ‌ర‌ణించ‌డంతో గ్రామంలో విషాదఛాయ‌లు అల‌ముకున్నాయి.

Advertisement
Advertisement