త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandra Venkata Ramana Reddy | రేవంత్ రెడ్డి యాక్సిడెంట‌ల్‌ ముఖ్య‌మంత్రి : గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి

Gandra Venkata Ramana Reddy | రేవంత్ రెడ్డి నువ్వు యాక్సిడెంట‌ల్‌గా ముఖ్యమంత్రి అయినావు.. అందరికీ నీలాగా తొక్కుకుంటా వచ్చే స్వభావం లేకపోవచ్చు అని బీఆర్ఎస్ నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Apr 21, 2026, 1.43 pm IST

Gandra Venkata Ramana Reddy | రేవంత్ రెడ్డి యాక్సిడెంట‌ల్‌ ముఖ్య‌మంత్రి : గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి
Advertisement

Gandra Venkata Ramana Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ రెడ్డి నువ్వు యాక్సిడెంట‌ల్‌గా ముఖ్యమంత్రి అయినావు.. అందరికీ నీలాగా తొక్కుకుంటా వచ్చే స్వభావం లేకపోవచ్చు అని బీఆర్ఎస్ నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఊడగోడతామని ప్రజలు డిసైడై ఉన్నారు. కొడంగల్‌లో నీకు డిపాజిట్లు కూడా రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. సీఎం సభతో ప్రజా ధనం దుర్వినియోగం తప్ప మరొకటి లేదన్నారు. యాక్సిడెంటల్‌గా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అని చెప్పుకోవడం సరైనది కాదని అది డిసైడ్ చేయవలసింది ప్రజలే అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా డిపాజిట్ కోల్పోతారని ఎద్దెవా చేశారు. తెలంగాణ‌లోనే సాగు త్రాగునీటి అవసరాలు తీర్చే గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని ప్రతి ఒక్కరికి తెలుసని అయితే విచారణల పేరుతో కాలయాపన చేసి ప్రాజెక్ట్‌ను పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారు.
ప్రజలు రేవంత్ రెడ్డి వైఖరిని గమనిస్తున్నారని గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement