Balka Suman | క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్, హరీశ్‌రావు
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడితో పాటు పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని సుమన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Balka Suman | త్రినేత్ర.న్యూస్ : మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడితో పాటు పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని సుమన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయనను రామకృష్ణాపురం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సుమన్ అరెస్టును అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దీంతో క్యాతనపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏ1గా బాల్క సుమన్..
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులు ఉదయం నుంచి పహారా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు యత్నించగా, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బాల్క సుమన్‌ను బలవంతంగా పోలీసులు మోసుకెళ్లి.. రామకృష్ణాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. రామకృష్ణాపురం పీఎస్‌లో బాల్క సుమన్‌పై 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1గా బాల్క సుమన్, ఏ2గా మూల రాజిరెడ్డి పేర్లను చేర్చారు.
బాల్క సుమన్‌ను బేషరతుగా విడుదల చేయాలి : కేటీఆర్
క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమని, నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్లసైగలకు తలొగ్గి పని చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని కేటీఆర్ హెచ్చరించారు. వందల మంది పోలీసులను పెట్టి మరి క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ మార్కు ‘కబ్జా రాజకీయం’ నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించడంతో పాటు ప్రభుత్వ మెప్పు కోసం చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసు అధికాఆరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్‌తో పాటు అక్రమంగా నిర్బంధించిన బీఆర్‌ఎస్ కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్క్ గుండాగిరి : హరీశ్‌రావు
క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు బాల్క సుమన్‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. ఒక్క క్యాతన్‌పల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు. రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు. బాల్క సుమన్‌ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్‌పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



