KTR | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ..! సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
KTR | రైతులు నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. ఇంకా తీరలేదా మీ రక్తదాహం..? అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా? అని మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : రైతులు నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా.. ఇంకా తీరలేదా మీ రక్తదాహం..? అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా? అని మండిపడ్డారు.
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి? తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్‌కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు అని దుయ్యబట్టారు. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు! 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
మలిదశ పోరాటంలో వెయ్యి మందిని బలితీసుకున్న మృగాలు మీరు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..! కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..! నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు! పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం! నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..! నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం! మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
తాజావార్తలు
- ●Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు
- ●Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట
- ●Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్
- ●England vs Norway | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు: క్వార్టర్స్‌లో నార్వే కొంపముంచిన ఆ తప్పులు ఇవే!
- ●Bollam Mallaiah Yadav | వీధి రౌడీలా సీఎం రేవంత్ మాటలు.. నిప్పులు చెరిగిన బొల్లం మల్లయ్య యాదవ్
- ●Anupama Parameswaran | మలయాళ బ్యూటీ నయా టాలెంట్ - మెగాఫోన్ పట్టబోతున్న అనుపమ

Oman Ship Attack | ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్.. 10 మంది భారతీయులు సేఫ్, ఒకరు గల్లంతు

Ganja Seized | రూ.20 లక్షల గంజాయి సీజ్.. రిసీవర్ కోసం పోలీసుల వేట

Weather Report | జూలై 15 వరకు ఎండలే ఎండలు.. బీ కేర్ ఫుల్

England vs Norway | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు: క్వార్టర్స్‌లో నార్వే కొంపముంచిన ఆ తప్పులు ఇవే!



