త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HPS | హెచ్‌పీఎస్‌కు రూ. 30 కోట్ల బకాయిలు.. 56 మంది విద్యార్థుల‌కు నో అడ్మిష‌న్స్

HPS | హైద‌రాబాద్‌లోని బేగంపేట‌, రామాంత‌పూర్ హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి 1వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల నిమిత్తం బెస్ట్ అవైల‌బుల్ స్కీమ్ కింద ఉమ్మ‌డి 10 జిల్లాల్లో లాట‌రీ ద్వారా 56 మంది విద్యార్థుల‌ను ఎంపిక చేశారు.

S

Telangana | Published On Jul 22, 2026, 5.52 pm IST

HPS | హెచ్‌పీఎస్‌కు రూ. 30 కోట్ల బకాయిలు.. 56 మంది విద్యార్థుల‌కు నో అడ్మిష‌న్స్
Advertisement

HPS | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్‌లోని బేగంపేట‌, రామాంత‌పూర్ హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి 1వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల నిమిత్తం బెస్ట్ అవైల‌బుల్ స్కీమ్ కింద ఉమ్మ‌డి 10 జిల్లాల్లో లాట‌రీ ద్వారా 56 మంది విద్యార్థుల‌ను ఎంపిక చేశారు. ఈ విద్యార్థులంద‌రికీ కూడా 20 రోజుల క్రితం మెడిక‌ల్ టెస్టులు నిర్వ‌హించారు. ఇప్ప‌టికీ కూడా స‌ద‌రు విద్యార్థుల‌కు అడ్మిష‌న్స్ ఆర్డ‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డంతో బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టారు.

విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మై 2 నెల‌లు పూర్త‌వుతుంది. ఎస్ఏ 1 ప‌రీక్ష‌లు కూడా పూర్త‌య్యాయి. అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 1వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల కోసం లాట‌రీ ద్వారా ఎంపిక చేసిన 56 మంది విద్యార్థులకు అడ్మిష‌న్ ఆర్డ‌ర్స్ ఇవ్వ‌లేదు. అడ్మిష‌న్స్ ఆర్డ‌ర్స్‌పై స్కూల్ వాళ్ల‌ని సంప్ర‌దిస్తే.. ప్రభుత్వం నుంచి హెచ్‌పీఎస్‌కు రూ. 30 కోట్ల బ‌కాయిలు రావాలి.. అవి విడుద‌ల‌య్చే వ‌ర‌కు త‌మ స్కూల్స్‌లో చేర్చుకోమ‌ని చెబుతున్నార‌ని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. నిలిచిపోయిన అడ్మిషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని,ఈ సమస్యను మీడియాలో అడ్రస్ చేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నామ‌ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు పేర్కొన్నార‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు.

Advertisement
Advertisement