త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | సాయంత్రం 6 గంట‌ల‌కు కేసీఆర్ మీడియా స‌మావేశం.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి..!

KCR | బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కేసీఆర్ మీడియా స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

S

Telangana | Published On Dec 21, 2025, 1.38 pm IST

KCR | సాయంత్రం 6 గంట‌ల‌కు కేసీఆర్ మీడియా స‌మావేశం.. స‌ర్వ‌త్రా ఆస‌క్తి..!
Advertisement

KCR | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, బీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడియాతో మాట్లాడ‌నున్నారు.

కేసీఆర్ మీడియాతో మాట్లాడుతార‌ని బీఆర్ఎస్ పార్టీ ప్ర‌క‌టించ‌డంతో.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. పొరుగున ఉన్న ఏపీలోనూ ఆయ‌న అభిమానులు, మ‌ద్ద‌తుదారులు, ఇత‌ర పార్టీలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. కేవ‌లం ఓ తెలుగు టీవీ చానెల్‌కు మాత్ర‌మే ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. న‌ల్ల‌గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల‌కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. దాదాపు రెండేండ్ల త‌ర్వాత కేసీఆర్ మీడియా ముందుకు రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లో.. ఆయ‌న ఏం మాట్లాడుతార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement