త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | ‘పెద్ది’ కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

KCR | తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగ‌త పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓదార్చి, పరామర్శించారు. పెద్ది కుటుంబానికి కేసీఆర్ కొండంత అండ‌గా నిలిచి భారీ ఆర్థిక సాయాన్ని అందించారు

S

Telangana | Published On Aug 9, 2026, 5.36 pm IST

KCR | ‘పెద్ది’ కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప‌రామ‌ర్శ‌
Advertisement

KCR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగ‌త పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓదార్చి, పరామర్శించారు. పెద్ది కుటుంబానికి కేసీఆర్ కొండంత అండ‌గా నిలిచి భారీ ఆర్థిక సాయాన్ని అందించారు. పార్టీ తరఫున రూ. 2.25 కోట్ల విలువ చేసే చెక్కును అంద‌జేశారు.

సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల పేరు మీద‌ చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉండ‌డంతో వారి బాగోగుల కోసం మరో రూ. 25 లక్షలు తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని సూచించారు. మొత్తంగా, 2.25 కోట్ల‌ రూపాయలను పెద్ది కుటుంబానికి భారత రాష్ట్ర సమితి ఆర్థిక సహాయాన్ని అందించి మాన‌వ‌త్వాన్ని చాటుకుంది.

Advertisement
Advertisement