KCR | ప్రమాదంలో తెలంగాణ అస్తిత్వం.. దాశరథి స్ఫూర్తి నేటి సమాజానికి అవసరం : కేసీఆర్
KCR | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన కలాన్ని గళాన్ని వినిపించిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఘన నివాళులు అర్పించారు. వారి కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిన నేపథ్యంలో, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వ పరిరక్షణ కోసం రాజులనే ఎదిరించిన కలం వీరుడు దాశరథి అందించిన స్ఫూర్తి తెలంగాణ సమాజానికి నేటి అవసరం అని కేసీఆర్ స్పష్టం చేశారు. దాశరథి అందించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ స్ఫూర్తి కొనసాగిద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
జైలు గోడల నడుమ బంధీ అయికూడా.." నా తెలంగాణ కోటి రతనాల వీణ " అంటూ గర్జించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సమర యోధుడు దాశరథి అని కేసీఆర్ కొనియాడారు. కృష్ణమాచార్యుల త్యాగాలను, తెలంగాణ అస్తిత్వం కోసం వారు చేసిన సాహితీ పోరాట కృషిని గుర్తించి, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ, వారి పేరున సాహితీ పురస్కారాన్ని నెలకొల్పిందని కేసీఆర్ గుర్తు చేశారు.
సంబంధిత వార్తలు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



