KCR | రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. కేసీఆర్ హెచ్చరిక
KCR | రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇవాళ్టి వరకు ఒక లెక్క రేపట్నుంచి మరో లెక్క అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు.
KCR
KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇవాళ్టి వరకు ఒక లెక్క రేపట్నుంచి మరో లెక్క అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.. ఇదేం దద్దమ్మ ప్రభుత్వం.. ఇంత చేతగానీ, నోరులేని ప్రభుత్వం ఉంటే ఎట్ల. ఇది ఒక ప్రభుత్వమా..? ఉన్న వస్త్రానికి పోతే అన్న వస్త్రం పోయినట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. రెండేండ్ల పాటు మౌనం పాటిస్తూ చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితుల్లోనే బయలేదరి వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడుతాం..

KCR
కేంద్రాన్ని నిలదీస్తాం. పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతాం. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ఎండగడుతాం. ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఏది..? ప్రభుత్వం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి. మాకు రెండు బాధ్యతలు ఉన్నాయి.. తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండోది ప్రధాన ప్రతిపక్షంగా మా డ్యూటీ మేం చేయాలి. ఏదో తమాషాకు అడ్డం పొడవు కారుకూతలు మాట్లాడి.. కిరికిరి మాటలు మాట్లాడి ఏందో చేస్తామంటే నడవదు. ఇవాళ్టి దాకా ఒక కథ.. రేపట్నుంచి ఇంకో కథ. ఎక్కడిక్కడ తోలు తీస్తాం. ప్రతి విషయంలో ఎండగడుతాం.. సమస్యలపై పోరాడుతామని కేసీఆర్ తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



