KCR | కుసుమ జగదీశ్ బిడ్డకు కేసీఆర్ అండ.. డాక్టరయ్యేందుకు ఆర్థిక సాయం..
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న పార్టీ నేతలను, కార్యకర్తలను, వారి కుటుంబాలను ఆదుకునే కేసీఆర్.. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి అండగా నిలిచారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న పార్టీ నేతలను, కార్యకర్తలను, వారి కుటుంబాలను ఆదుకునే కేసీఆర్.. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయం.. పార్టీ నాయకుల ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. మంచిగా చదువుకోవాలని, కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



