త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి

Harish Rao | తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ మంట గ‌లిసింద‌ని.. కేంద్రం, గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకొని రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. క‌లియుగ దుశ్శాసనుడు రేవంత్‌రెడ్డి అని అన్నారు.

S

Telangana | Published On Sep 8, 2026, 6.05 pm IST

Harish Rao | తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి
Advertisement
  • రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మంట గలిసింది
  • కేసీఆర్ ఇంటిపై దాడి వికృత చర్య
  • కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలి
  • జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద హరీశ్ రావు వ్యాఖ్య‌లు

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ‌లో లా అండ్ ఆర్డ‌ర్ మంట గ‌లిసింద‌ని.. కేంద్రం, గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకొని రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. క‌లియుగ దుశ్శాసనుడు రేవంత్‌రెడ్డి అని అన్నారు. కేసీఆర్ ఇంటిపై దాడిని వికృత చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. రేవంత్‌రెడ్డి భేష‌ర‌తుగా స‌మాధానం చెప్పాల‌న్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావాలని అనడం దారుణమ‌న్నారు. ఆయనపై వెంటనే తీర్మానం పెట్టి సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల తీర్పును మార్చలేవ్‌..

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నడు. సభలో చర్చ జరిగితే వైఫల్యాలు బయట పడుతాయని చర్చ జరగకుండా ప్లాన్ చేసిండు. మిస్టర్! రేవంత్ రెడ్డి ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. డైవర్షన్ పాలిటిక్స్ తో పేపర్ హెడ్ లైన్స్ మార్చుతావు కావొచ్చు ప్రజల జీవితాలు మార్చలేవు. సోషల్ మీడియా ట్రెండ్ మార్చుతావేమో గానీ, రైతులు, విద్యార్థుల కష్టాలు మార్చలేవు. డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల తీర్పును మార్చలేవు. డైవర్షన్ పాలిటిక్స్ ఆపి ప్రజల సమస్యలు తీర్చు.

నాలుగు వేల పింఛన్ ఏమైందని రైతులు ఆడుగుతున్నారు. పెంచుతానన్న రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు. వెయ్యి రోజులు అయినా నీ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు. బకాయిలతో సహా చెల్లించాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏపీ క్రాప్ హాలిడే లేదు, కానీ ఈ చేతగాని దద్దమ్మ సీఎం వల్ల ఇక్కడ క్రాప్ హాలిడే
యూరియా యాపులు పెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. నీల్లు లేక పంటలు ఎండుతున్నాయి. కరెంట్ ఇవ్వలేక చేతులు ఎత్తుతున్నారు.

కేసీఆర్ పాలనలో ఈ సమస్యలు లేవు, మీరు రాగానే ఎందుకు మొదలయ్యాయి. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం, ఉద్యోగులు పీఆర్సీ, డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. క‌రోనా ఉన్నా, పెద్ద నోట్ల రద్దు ఉన్నా కేసీఆర్ 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు క్లియర్ చేసారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. 22ఏ పెట్టి రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల గుండెపై బండ వేసారు.

స్పీకర్ గారు మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరగలేదని ఎలా అంటారు? యావత్ దేశం చూసింది, మీడియాలో వచ్చింది. ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు కాలేదు. ఉల్టా దాడి జరిగిన సునీతమ్మ, సబితమ్మ, కోవా లక్ష్మిపై కేసు పెట్టారు. మహిళా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం అంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటె అన్నట్లే. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికి అరెస్టులు చేసి వికృతానందం పొందుతున్నడు.

స్పీకర్ గారి మీద కావాలని అనలేదు, అందుకు క్షమాపణలు అని తాతా గారు చెప్పారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగితే ఎందుకు చర్చ చేయడం లేదు. ఎందుకు మహిళా ఎమ్మెల్యేలకు మైకులు ఇవ్వడం లేదు. కలియుగ దుశ్శాసనుడు రేవంత్ రెడ్డి. ఆనాడు ద్రౌపతి పట్ల వ్యవహరించిన తీరు గుర్తు చేస్తున్నది. చెప్పుకోవడానికి అసెంబ్లీలో వారికి అవకాశంగా ఇవ్వడం లేదు. గౌరవ సభను కౌరవ సభగా చేసాడు. బీజేపీ వాళ్లు ప్లకార్డులు తీసుకువెళ్తే అడ్డుకోరు, మేం టీ షర్ట్స్ వేసుకుంటే అడ్డుకుంటరు. బీజేపీ, కాంగ్రెస్ బంధం ఇదే కదా!

బడివే అని, తంతం అని అసంబ్లీలో అంటే వికృత భాష కాదా? మేం ఆరు గ్యారెంటీల గురించి అడిగితే వికృత భాషనట. మొన్న పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు పిసికారు. నిన్న సబితమ్మ గొంతు పిసికారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఇంటిపైకి దాదికి ఉసిగొల్పారు. రోప్ పార్టీ ఇచ్చి, ఎస్కార్ట్ ఇచ్చి దాడికి దగ్గరుండి ప్రోత్సహించారు. హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది క్షమాపణ చెప్పు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి జరిగింది క్షమాపణ చెప్పు.

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది, కేంద్రం, గవర్నర్ గారిని కోరుతున్నాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదు. అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలన మంట గలిసింది. గవర్నర్ గారు కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాహుల్ గాంధీ గారు మీరు ఎందుకు మాట్లాడటం లేదు. లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకొని గూండాల్లాగా బిహేవ్ చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఉండే నువ్వు ఇక్కడ జరుగుతున్న రాజ్యాంగ భక్షన కనిపించడం లేదా?

మేం ఫిర్యాదు ఇస్తే తీసుకుంట‌లేరు..

కేటీఆర్, యాదవ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సంజయ్‌, నాకు అందరికీ దెబ్బలు తాకాయి. మేం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదు. చేతిలో అధికారం ఉందని, మందబలం ఉందని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే కౌరవులకు పట్టిన పరిస్థితే మీకు ఉంటుంది.

రెండు రోజులు వృథా చేశారు..

సభలో ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థానం ప్రతిపక్ష నాయకుడిది. అలాంటి నాయకుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు స్పీకర్ గారు. ఇదేం ప్రజాస్వామ్యం. 119 ఎమ్మెల్యేలను సమానంగా చూడాలి. ఎందుకు ఏపక్షంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజులు ప్రజల సమస్యలపై చర్చ లేకుండా వృథా చేశారు. బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలి పెట్టదు. ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటం. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం అని హ‌రీశ్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement