త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | ఆ విమానం ఏ క్ష‌ణ‌మైన పేలిపోవ‌చ్చు.. శంషాబ‌ద్ విమానాశ్ర‌యానికి బాంబు బెదిరింపు

Bomb Threat | శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి (Shamshabad Airport) మ‌రోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వ‌చ్చింది. జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి హైద‌రాబాద్‌కి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో (Lufthansa flight) బాంబు ఉంద‌ని, అది దిగ‌డానికి ముందే ఏ క్ష‌ణంలోనైనా పేలిపోయే అవ‌కాశం ఉంద‌ని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక అనామక ఈమెయిల్ వ‌చ్చింది.

G

Telangana | Published On Jun 13, 2026, 10.25 am IST

Bomb Threat | ఆ విమానం ఏ క్ష‌ణ‌మైన పేలిపోవ‌చ్చు.. శంషాబ‌ద్ విమానాశ్ర‌యానికి బాంబు బెదిరింపు
Advertisement

Bomb Threat | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి (Shamshabad Airport) మ‌రోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వ‌చ్చింది. జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్ నుంచి హైద‌రాబాద్‌కి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో (Lufthansa flight) బాంబు ఉంద‌ని, అది దిగ‌డానికి ముందే ఏ క్ష‌ణంలోనైనా పేలిపోయే అవ‌కాశం ఉంద‌ని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్టు అధికారులకు ఒక అనామక ఈమెయిల్ వ‌చ్చింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమ‌య్యారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే దానిని ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది విమానంలో అనువ‌ణువు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వ‌హించారు. ప్రయాణికులను దించి, వారి లగేజీతోని కూడా ప‌రిశీలించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాంబు బెదిరింపు ఫేక్ ఈమెయిల్‌గా అధికారులు నిర్ధారించారు. కేసు న‌మోదుచేసి, మెయిల్‌ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement
Advertisement