Nitin Nabin | కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా రేవంత్ సర్కార్ : నితిన్ నబీన్
Nitin Nabin | తెలంగాణ ప్రజలకు సేవ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. నిజంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి ఉంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలు ఇప్పటికే ప్రతి ఇంటికీ చేరి ఉండేవని ఆయన పేర్కొన్నారు.
Nitin Nabin | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రజలకు సేవ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చిందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. నిజంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి ఉంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రయోజనాలు ఇప్పటికే ప్రతి ఇంటికీ చేరి ఉండేవని ఆయన పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్ రాక్ ఎంక్లేవ్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ ప్రసంగించారు.
ఆరు గ్యారంటీలు సహా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిలో ఒక్క హామీని కూడా ప్రజలకు సంతృప్తికరంగా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి అయినా, మహిళలకు ఆర్థిక సహాయం అయినా, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదన్నారు. రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి, భారతీయ జనతా పార్టీ సందేశాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ వెంట నడిచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేశంలో 12 ఏళ్లలో చాలా పరివర్తన వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఎలా గెలిచారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. భాజపా కార్యకర్తల కష్టాలతో పశ్చిమబెంగాల్‌లో గెలిచామని చెప్పానని నబీన్ గుర్తు చేశారు. అక్కడ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారు. అయినా, లెక్కచేయకుండా భాజపాని గెలిపించాలనే ఆలోచనతో వారు పనిచేశారని నబీన్ తెలిపారు.
సర్‌పై ప్రజలకు భాజపా కార్యకర్తలు అవగాహన కల్పించాలి. తెలంగాణలో సర్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయి. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది అని నితిన్ నబీన్ ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, నగేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు
- ●Sai Pallavi | సాయిపల్లవినా .. మజాకా - షూటింగ్ మొదలుకాకముందే మణిరత్నం మూవీ బిజినెస్ క్లోజ్
- ●Delhi EV Policy | ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. ఓలా, ఏథర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు..
- ●Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనన్న రాఘవ లారెన్స్.. త్రిషకు లైన్ క్లియర్ అయినట్టేనా?
- ●Venezuela | జంట భూకంపాలతో వెనెజువెలా అతలాకుతలం.. 1700 మంది మృతి.. 50 వేల మంది మిస్సింగ్
- ●Traffic Restrictions | బీ అలర్ట్.. హైటెక్ సిటీ వద్ద రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు..!

Tree Falls On School Bus | స్కూల్ బస్సుపై కూలిన చెట్టు.. 10 ఏళ్ల చిన్నారి మృతి.. పలువురికి గాయాలు

Sai Pallavi | సాయిపల్లవినా .. మజాకా - షూటింగ్ మొదలుకాకముందే మణిరత్నం మూవీ బిజినెస్ క్లోజ్

Delhi EV Policy | ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. ఓలా, ఏథర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు..

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనన్న రాఘవ లారెన్స్.. త్రిషకు లైన్ క్లియర్ అయినట్టేనా?






