త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!

TV Channels | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కీలక సూచనలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం, 1995 ప్రకారం నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

S

National | Published On Oct 21, 2026, 6.31 pm IST

TV Channels | టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!
Advertisement

TV Channels | త్రినేత్ర న్యూస్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు కీలక సూచనలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం, 1995 ప్రకారం నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

మంత్రిత్వ శాఖ సూచించిన ప్రధాన అంశాలు:

  • బాధ్యతాయుతమైన వార్తా ప్రసారం: వార్తలను ప్రసారం చేసేటప్పుడు వాస్తవాలను నిర్ధారించుకోవాలి. బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారం వద్దు: ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • హింసాత్మక దృశ్యాలపై అప్రమత్తత: హింసకు సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేసేటప్పుడు సంయమనం పాటించాలి.
  • బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచాలి: లైంగిక నేరాల బాధితుల గుర్తింపు బయటపడకుండా చూడాలి.
  • భారతదేశ పటాలు సరిగ్గా చూపాలి: దేశ భౌగోళిక సరిహద్దులను ప్రతిబింబించే ప్రామాణిక పటాలను మాత్రమే ఉపయోగించాలి.
  • మత సామరస్యానికి భంగం కలిగించే కంటెంట్ వద్దు: మత విద్వేషాలు రెచ్చగొట్టే లేదా దేశ వ్యతిరేకంగా పరిగణించే కంటెంట్ విషయంలో నిబంధనలను పాటించాలి.
  • ఏఐ వినియోగంలో జాగ్రత్త: కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందించే కంటెంట్‌ను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
  • ఎడిటోరియల్ పర్యవేక్షణ పెంచాలి: ప్రసారమయ్యే వార్తలు, దృశ్యాలపై సంపాదకీయ విభాగం తగిన పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి.
  • టెలివిజన్ ఛానళ్లు ప్రసార నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రజలకు విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది.

Advertisement
Advertisement