త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మ‌హాన‌ది బొగ్గును కేటాయించండి..

Tummala Nageshwar Rao | కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageshwar Rao ) శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అభివృద్ధికి, వివిధ రంగాలకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మ‌ల‌ వినతిపత్రాలు అందజేశారు.

S

Telangana | Published On Oct 16, 2026, 5.17 pm IST

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మ‌హాన‌ది బొగ్గును కేటాయించండి..
Advertisement

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి మంత్రి తుమ్మ‌ల విజ్ఞ‌ప్తి

Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Tummala Nageshwar Rao ) శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అభివృద్ధికి, వివిధ రంగాలకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి తుమ్మ‌ల‌ వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం తెలపాలని విజ్ఞ‌ప్తి చేశారు.

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు మహానది బొగ్గును కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రానికి నిరంతర యూరియా సరఫరా చేయడంతో పాటు ఆర్ఎఫ్‌సీఎల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.

సత్తుపల్లి బొగ్గు బ్లాక్-III ను సింగరేణికి కేటాయించాలని, భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటును వేగవంతం చేయాలని విన్నవించారు. ఇక రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, పెనుబల్లి–కొండపల్లి, పాండురంగాపురం–మల్కన్‌గిరి రైల్వే లైన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి వినతి పత్రం సమర్పించారు.

Advertisement
Advertisement