త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

P Muralidhar Rao | ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై కేసు న‌మోదు.. ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ నేత ఫైర్

P Muralidhar Rao | మాజీ ఎమ్మెల్సీ, రాజ‌కీయ విశ్లేష‌కులు ప్రొఫెసర్ నాగేశ్వ‌ర్‌పై ఏపీ ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేయ‌డాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత పీ ముర‌ళీధ‌ర్ రావు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

S

Telangana | Published On May 24, 2026, 7.20 pm IST

P Muralidhar Rao | ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌పై కేసు న‌మోదు.. ఏపీ స‌ర్కార్‌పై బీజేపీ నేత ఫైర్
Advertisement

P Muralidhar Rao | త్రినేత్ర‌.న్యూస్ : మాజీ ఎమ్మెల్సీ, రాజ‌కీయ విశ్లేష‌కులు ప్రొఫెసర్ నాగేశ్వ‌ర్‌పై ఏపీ ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేయ‌డాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత పీ ముర‌ళీధ‌ర్ రావు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఒక విశిష్ట రాజ‌కీయ విశ్లేష‌కుడిగా గౌర‌వాన్ని పొందుతున్న నాగేశ్వ‌ర్‌పై ఏపీ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం స‌రికాదు. ఏపీ రాజ‌కీయాల‌పై నాగేశ్వ‌ర్ చేసిన వ్యాఖ్య‌లను ఆయ‌న ఉప‌సంహ‌రించుకున్నారు. జ‌న‌సేన నాయ‌క‌త్వం కూడా అంగీక‌రించింది. అయినా కూడా పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌న‌మూ ఉండ‌దన్నారు. పైగా ఇది భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు సంబంధించిన అంశ‌మని ముర‌ళీధ‌ర్ రావు అన్నారు.

Advertisement
Advertisement