Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
Ramachander Rao | కలోనియల్ మైండ్‌సెట్‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు.. దేశ ప్రజల ఆవేదన అర్థం కాదు. అందుకే మన విద్యార్థుల ఆవేదన కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.
దేశ ప్రజల ఆవేదన కూడా అర్థం కాదు
కాంగ్రెస్ పార్టీ ఆలోచనంతా కూడా ఒక విదేశీ ఆలోచన
అందుకే వందేమాతర గీతంలో రెండే చరణాలు పాడారు
ఇవాళ మళ్లీ ఆ ప్రతిపాదన తీసుకురావడమంటే
భారతదేశాన్ని అవమానపరిచినట్టే
బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
Ramachander Rao | త్రినేత్ర.న్యూస్ : కలోనియల్ మైండ్‌సెట్‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు.. దేశ ప్రజల ఆవేదన అర్థం కాదు. అందుకే మన విద్యార్థుల ఆవేదన కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. కరీంనగర్‌లో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” మహాధర్నాలో పాల్గొని రామచందర్ రావు ప్రసంగించారు.
1937లో వందేమాతరంను రెండే రెండు చరణాలు పాడాలని కాంగ్రెస్ పార్టీ కండీషన్ పెట్టిందట. ఆ సమయంలో దేశంలో బ్రిటీష్ పరిపాలన ఉంది. ఒక బ్రిటీషర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీలో పెట్టిన ప్రతిపాదనను మనమేందుకు ఒప్పుకోవాలి. 1937లో ముస్లిం లీగ్‌కు తలవంచి వందేమాతరం మొత్తం పాడం, రెండే చరణాలు పాడుతమని చేసినటువంటి ప్రకటన చేసింది. ఇవాళ మళ్లీ అదే ప్రతిపాదన తీసుకోవడం దేశాన్ని అవమానపరిచినట్టు. ఎందుకంటే ఈ వందేమాతర నినాదంతోనే స్వాతంత్య్ర పోరాటం జరిగింది. అయితే వందేమాతర గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానపరిచింది అంటే.. ఆ పార్టీని ఒక విదేశీ స్థాపించాడు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంతా కూడా ఒక విదేశీ ఆలోచన. కాబట్టి కలోనియల్ మైండ్‌సెట్‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు. దేశ ప్రజల ఆవేదన అర్థం కాదు. అందుకే మన విద్యార్థుల ఆవేదన కూడా కాంగ్రెస్ పార్టీకి అర్థం కావడం లేదు అని రామచందర్ రావు పేర్కొన్నారు. .
గత ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మిగిల్చి వెళ్లగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల జీవితాలు, భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు. కాలేజీ యాజమాన్యాలకు నిధులు అందక అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడగా, కొన్ని విద్యాసంస్థలు మూతపడే దిశగా నెట్టబడుతున్నాయని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీలు కూడా గాలికి కొట్టుకుపోయాయి.పెండింగ్‌లో ఉన్న ప్రతి రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి విడుదలయ్యే వరకు భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు అండగా నిలిచి, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని రామచందర్ రావు తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతి కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో పాటు వేలాది మంది విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్
- ●Polytechnic Students | మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?
- ●Telangana State Film Chamber | తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్

Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Polytechnic Students | మీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?

Telangana State Film Chamber | తెలంగాణ సర్కార్‌కు ఫిల్మ్ ఛాంబర్ లేఖ: ఆ జీవోతో సింగిల్ స్క్రీన్లకు ముప్పే





