త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alleti Maheshwar Reddy | ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వ‌ర్సెస్ మంత్రులు.. బీసీ మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపుపై లొల్లి

Alleti Maheshwar Reddy | రాష్ట్ర ప్ర‌భుత్వ అవినీతి కుంభ‌కోణాల‌పై మాట్లాడుతున్నందుకే త‌న ప్ర‌సంగాన్ని అడ్డుకుంటున్నార‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ముగ్గురు మంత్రులు లేచి, త‌నకు అడ్డు ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Mar 18, 2026, 5.52 pm IST

Alleti Maheshwar Reddy | ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వ‌ర్సెస్ మంత్రులు.. బీసీ మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపుపై లొల్లి
Advertisement

Alleti Maheshwar Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వ అవినీతి కుంభ‌కోణాల‌పై మాట్లాడుతున్నందుకే త‌న ప్ర‌సంగాన్ని అడ్డుకుంటున్నార‌ని బీజేఎల్పీ నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే ముగ్గురు మంత్రులు లేచి, త‌నకు అడ్డు ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ఏలేటి మహేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో బీసీల‌కు ప్రాధాన్య‌త లేకుండా పోయింద‌ని, బీసీ వ‌ర్గానికి చెందిన మంత్రికి ప్రాధాన్య‌త లేని శాఖ‌లు క‌ట్ట‌బెట్టారు. కోళ్లు, చేపల శాఖ అప్ప‌గించార‌ని, ఇవి కాకుండా ఇత‌ర శాఖ‌లు అప్ప‌గించొచ్చు క‌దా..? అని ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప్ర‌శ్నించారు.

ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధ‌ర్ బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ..  ప్ర‌తి పోర్ట్ పోలియోకు ఇంపార్టెంట్ ఉంటుంది. మ‌హేశ్వ‌ర్ రెడ్డి త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి. ఒక బీసీ మంత్రిని ప‌ట్టుకుని, ప‌శుసంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య‌శాఖ‌పై ఆధార‌ప‌డ్డ ల‌క్ష‌లాది మందిని కించ‌ప‌రిచే విధంగా మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడ‌డం స‌రికాదు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి క్ష‌మాపణ చెప్పాలి. ఇంత చుల‌క‌న‌గా మాట్లాడ‌టం స‌రికాదు. అన్ని పోర్టు పోలియోలు ముఖ్య‌మే. కోళ్ల‌ను అమ్మే శాఖ అంటున్నారు. కోళ్ల ప‌రిశ్ర‌మ‌పై అంత చుల‌న‌క ఎందుకు..? బీఆర్ఎస్ వాళ్ల‌కు మ‌హిళ‌లంటే చుల‌క‌న‌.. బీజేపీ నేత‌ల‌కు ఓబీసీలంటే లెక్క‌నే లేదు అని శ్రీధ‌ర్ బాబు మండిప‌డ్డారు.

ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి స్పందిస్తూ.. మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలివిగా స‌బ్జెక్టును డివియేట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌కు అప్రాధాన్య‌త శాఖ మ‌త్స్య శాఖ ఇచ్చార‌ని మంత్రి శ్రీహ‌రి ఆందోళ‌న చెందారని మ‌హేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడుతూ.. నేను మీడియాలో కూడా స్ప‌ష్టంగా చెప్పాను. నేను చిన్న‌నాటి త‌నంలో ఏ క‌ష్టం చేశానో.. ఇప్పుడు అదే శాఖ ద‌క్కింది.. అదృష్టం చూడ‌డండి అ పోర్టు పోలియో రావ‌డం భ‌గ‌వంతుడు ఇచ్చిన అవ‌కాశంగా భావిస్తున్నాను. ఫిష‌ర్‌మెన్ క‌మ్యూనిటీకి సంబంధించిన వ్య‌క్తికి చేప‌ల శాఖ రావ‌డం ఇది మొద‌టిసారి అని వాకిటి శ్రీహ‌రి పేర్కొన్నారు.

త‌ద‌నంత‌రం మ‌ళ్లీ ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ మంత్రికి వారికి సంబంధించిన కుల‌వృత్తి శాఖ‌నే ఎందుకు క‌ట్ట‌బెట్టారు. అడిష‌న‌ల్ పోర్ట్ పోలియో ఇవ్వొచ్చు క‌దా..? ఎడ్యుకేష‌న్, హోం, రెవెన్యూ శాఖ‌లు ఎందుకు ఇవ్వ‌రు..? ఈ శాఖ‌లు ఇవ్వాల‌ని మేం అడ‌గ‌డంలో త‌ప్పేముంది..? అని మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిల‌దీశారు.

ఆ త‌ర్వాత మంత్రి శ్రీధ‌ర్ బాబు క‌లగ‌జేసుకుని.. మా ప్రాంతానికి చెందిన ఎంపీలు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. బండి సంజ‌య్‌కు ఏం శాఖ ఇచ్చారు. స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. కేబినెట్ మంత్రిగా ఎందుకు చోటు క‌ల్పించ‌లేదు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన‌ స‌భ్యుడికి మీరేం ఇచ్చార‌ని అడుగుతున్నామ‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డిని మంత్రి శ్రీధ‌ర్ బాబు నిల‌దీశారు.

చివ‌ర‌గా ఏలేటి మహేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ రాష్ట్రంలో అవినీతి కుంభ‌కోణాల గురించి మాట్లాడ‌గానే ముగ్గురు మంత్రులు లేచారు.. అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అవినీతిపై మాట్లాడుతుంటే న‌న్ను ఆపే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వెలిబుచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement