MP Raghunandan Rao | 22ఏ లో కోటి ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
MP Raghunandan Rao | 22ఏ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్పు చేస్తే ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
- ఈ విషయంలో మంత్రి తప్పు చేస్తే ఆయన్ను బర్తరఫ్ చేయాలి
- సీఎం రేవంత్ ఒకలా, మంత్రి పొంగులేటి మరోలా మాట్లాడారు
- రేపటి అసెంబ్లీలోనైనా 22ఏ పై వాస్తవాలు మాట్లాడాలి
- అసైన్డ్ భూములు ఎవరి కంట్రోల్‌లో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలి
- బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్
MP Raghunandan Rao | త్రినేత్ర.న్యూస్: 22ఏ లో కోటి ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని.. ఈ విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్పు చేస్తే ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ధరణి, భూభారతిల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ హైకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరపాలన్నారు. అసైన్డ్ భూములు ఎవరి కంట్రోల్‌లో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సింఫోనీ కాలనీలో ఉన్న సమస్యపై బీజేపీ, బీఆర్ఎస్ మాట్లాడినంత మాత్రాన రెండు పార్టీలు ఒక్కటి కాదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా 22ఏ అంశంపై ఆందోళన జరుగుతుంది. రైతులు, పేద ప్రజలు ఆందోళన పడుతున్నారు. 22ఏ విషయంలో మంత్రి తప్పు చేస్తే ఆయన్ను బర్తరఫ్ చెయ్యాలి. అసైన్డ్ చట్టాన్ని ఎత్తివేస్తారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత మందికి అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి.. ఇపుడు ఎవరి కంట్రోల్‌లో ఉన్నాయో శ్వేత పత్రం విడుదల చేయాలి.
రెవెన్యూ మంత్రి ఒకలా.. ముఖ్యమంత్రి ఒకలా మాట్లాడారు. 22ఏ విషయంలో తప్పు చేసిన అధికారులను శిక్షించండి. 22ఏ భూముల విషయంలో భయపడొద్దు అని పొంగులేటి హామీ ఇచ్చారు. ప్రజలంతా అసెంబ్లీ సమావేశాల కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రభుత్వ భూములను మింగేస్తారని 22ఏ ప్రకారం గుడులు, బడులు, ఆనాడు మంచి ఆలోచనతో, లక్ష్యంతో చట్టం తెచ్చారు.
రాజీవ్ రహదారి.. జాతీయ రహదారి కాదు
పొంగులేటి ప్రిపేర్ అయి అసెంబ్లీలో మాట్లాడలేదు. కొండపాక వెలికట్ట గ్రామం గురించి మాట్లాడారు. ఆ గ్రామం సిద్దిపేటలో కాదు.. గజ్వేల్ లో ఉంది. రాజీవ్ రహదారి.. జాతీయ రహదారి కాదు. తెలియనిది తెలియదు అని చెప్తే పొంగులేటి కోపం. సింఫోనీ కాలనీలో రెండు రిజిస్ట్రేషన్లకు రెండు రెండు లక్షలు తీసుకున్నారు. 22ఏ లో ఉందని చెప్పిన పావని వాళ్ళ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాలేదు. సింఫోనీ కాలనీలో సమస్య ఉంది. అక్కడ సమస్య ఉంది కాబట్టే అందుకే బీజేపీ, బీఆర్ఎస్ లు మాట్లాడుతున్నాయి. ఒక సమస్య గురించి మాట్లాడితే.. రెండు పార్టీలు ఒక్కటి అయినట్లు కాదు.
కాంగ్రెస్ వచ్చాక 43,440 ఎకరాలు 22ఏ కింద తీసేసిన భూములు ఎక్కడ తీసేశారు? అవి 22ఏ లో పెట్టిన వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దొంగాపోలీస్ ఆట ఆడుతున్నాయి. 22ఏ లో కోటి ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి. 22ఏ లో ఉన్న భూముల వివరాలు ఎందుకు బహిరంగంగా బయటపెట్టరు. రేపు అసెంబ్లీలో 22ఏ పై వాస్తవాలు మాట్లాడాలి.
నాకు బీఆర్ఎస్ చుట్టం కాదు.. కాంగ్రెస్ శత్రువు కాదు. 22ఏ లో ఉన్న భూములను ఎంత సమయంలో ఎత్తేసారు. పేదలకు జరిగిన అన్యాయానికి.. నష్టపరిహారం ఏమైనా ఇస్తారా? భూ భారతి వచ్చాకా కూడా తప్పు జరిగింది అని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. తప్పులు చేసింది ఎవరు? వాళ్లపై చర్యలు తీసుకుంటారా లేదా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Rajiv Yuva Vikasam Scheme | నవంబర్ 19 నుంచి 'రాజీవ్ యువ వికాసం' తొలి విడత సాయం
- ●Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న ఆషికా రంగనాథ్
- ●Agriculture | సేంద్రియ పంటలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్
- ●CM Prajavani | ప్రజల విశ్వాసం పెరిగేలా అధికారులు పని చేయాలి
- ●MRI Scanning | అర్హులైన రోగులకు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్
- ●‘సారీ’ చెప్పలేదు.. పార్టీని వీడలేదు.. అసలు కొండా ప్లాన్ ఏంటి?

Rajiv Yuva Vikasam Scheme | నవంబర్ 19 నుంచి 'రాజీవ్ యువ వికాసం' తొలి విడత సాయం

Ashika Ranganath | క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న ఆషికా రంగనాథ్

Agriculture | సేంద్రియ పంటలకు మార్కెట్లో అత్యధిక డిమాండ్

CM Prajavani | ప్రజల విశ్వాసం పెరిగేలా అధికారులు పని చేయాలి



