Rat Poison | రాత్రి పూట ఎలుకల విషాన్ని ఆర్డర్ చేసింది.. డెలివరీ బాయ్ విషయాన్ని పసిగట్టాడు..
Rat Poison | ఈ-కామర్స్ సైట్లు, డెలివరీ యాప్స్ పుణ్యమా అని ప్రస్తుతం కిరాణా సరుకులు ఏవి కావల్సి వచ్చినా సరే మనకు 10 నిమిషాల్లోనే ఇంటికే డెలివరీ అవుతున్నాయి. చాలా వరకు యాప్‌లు ఇన్‌స్టంట్ డెలివరీలను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు చాలా వేగంగా సరుకులను డెలివరీ ఇవ్వాలని ఆయా సంస్థలు ఈ సేవలను ప్రారంభించాయి.
Viral news | Published On Jan 10, 2026, 7.58 am IST
Rat Poison | ఈ-కామర్స్ సైట్లు, డెలివరీ యాప్స్ పుణ్యమా అని ప్రస్తుతం కిరాణా సరుకులు ఏవి కావల్సి వచ్చినా సరే మనకు 10 నిమిషాల్లోనే ఇంటికే డెలివరీ అవుతున్నాయి. చాలా వరకు యాప్‌లు ఇన్‌స్టంట్ డెలివరీలను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు చాలా వేగంగా సరుకులను డెలివరీ ఇవ్వాలని ఆయా సంస్థలు ఈ సేవలను ప్రారంభించాయి. కానీ ఓ మహిళ మాత్రం దీన్ని తన ఆత్మహత్యకు ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. ఏకంగా 3 ప్యాక్‌ల ఎలుక విషాన్ని అలాంటి ఓ యాప్‌లో ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ బాయ్ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి అసలు విషయాన్ని పసిగట్టాడు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో ఓ వ్యక్తి బ్లింకిట్ అనే డెలివరీ యాప్‌లో బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి తాజాగా ఓ సంఘటన ఎదురైంది. ఓ మహిళ ఆ యాప్‌లో 3 ప్యాకెట్ల ఎలుక విషాన్ని రాత్రి పూట ఆర్డర్ చేసింది. అయితే ఆశ్చర్యానికి గురైన ఆ డెలివరీ బాయ్‌కి అప్పుడే డౌట్ వచ్చింది. రాత్రి పూట ఈ సమయంలో ఎలుకల విషాన్ని అది కూడా ఆన్‌లైన్‌లో ఎవరు ఆర్డర్ చేస్తారు..? అని షాకవుతూనే డెలివరీ తీసుకుని ఆ ఆర్డర్ వచ్చిన చోటుకు వెళ్లాడు. అక్కడ ఓ మహిళ ఆ ఆర్డర్‌ను తీసుకునేందుకు ఇంటి బయటకు ఏడస్తూ వచ్చింది. అయితే ఏదో తేడా ఉందని కనిపెట్టిన ఆ డెలివరీ బాయ్ వెంటనే ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలని అనుకున్నాడు.
ఆ మహిళకు ఆ బాయ్ పలు విధాలుగా నచ్చజెప్పాడు. జీవితం, ప్రాణం చాలా విలువైందని, పోతే మళ్లీ తిరిగి రావని, ఎంత కష్టంలో ఉన్నా సరే బలవన్మరణానికి పాల్పడవద్దని, కష్టాలు అనేవి ఇప్పుడు ఉంటాయి, కొన్ని రోజులకు అవే పోతాయి, ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దని చాలా సేపు నచ్చజెప్పాడు. దీంతో ఆ మహిళ అతను చెప్పిన మాటలకు మారింది. ఈ క్రమంలో డెలివరీ బాయ్ ఆ ఆర్డర్‌ను తానే స్వయంగా క్యాన్సిల్ చేశాడు. అయితే ఈ సంఘటనను అతను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందరూ అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. అదే ఏ రోబోనో ఆ డెలివరీ ఇచ్చి ఉంటే ఆ మహిళ ఈపాటికి చనిపోయింది, ఒక ప్రాణాన్ని నిలబెట్టిన ఆ డెలివరీ బాయ్‌కి బ్లింకిట్ సంస్థ ఏదైనా రివార్డు ఇవ్వాలని నెటిజన్లు అంటున్నారు. అయితే మరోవైపు ఈ సంఘటనపై మాత్రం బ్లింకిట్ ఇంకా స్పందించలేదు.
View this post on Instagram
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



