Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!
భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లకు వీలుకాని భూముల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. మీ భూమి 22A జాబితాలో ఉంటే ఆన్‌లైన్‌లో ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి.
- భూభారతి పోర్టల్‌లో నమోదైన మొత్తం భూమి విస్తీర్ణం సుమారు 2.49 కోట్ల ఎకరాలు
- అటవీ, అసైన్డ్, దేవాదాయ, ప్రభుత్వ భూముల లావాదేవీలపై పోర్టల్‌లో నిషేధం
- ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు మధ్య వివాదంలో ఉన్న 3.73 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి 22A జాబితాలో నమోదు
- భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వెరిఫికేషన్ తర్వాత 22A నుంచి భూములను తొలగించే అవకాశం
Bhu Bharati Portal | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో భూముల వివరాల నిర్వహణ, పారదర్శకత కోసం అందుబాటులో ఉన్న 'భూభారతి' (Bhubharati) పోర్టల్‌లో మొత్తం 2,49,97,312 ఎకరాల భూమి నమోదైంది. అయితే, ఇందులో లక్షలాది ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ మాడ్యూల్ కింద లావాదేవీలు (Transactions) చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం ప్రత్యేక కేటగిరీలుగా విభజించింది.
రిజిస్ట్రేషన్ కాని భూముల వివరాలు
అధికారిక లెక్కల ప్రకారం అటవీ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు తదితర వాటర్ బాడీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. భూభారతిలో బ్లాక్ చేసిన భూముల కేటగిరీలు, ఖాతాలు, వాటి విస్తీర్ణం (ఎకరాల్లో) ఇలా ఉన్నాయి.

22-A జాబితాలో 3.7 లక్షల ఎకరాలు
ప్రస్తుతానికి, ప్రభుత్వానికి, ప్రైవేట్ ఖాతాదారులకు మధ్య వివాదంలో (Dispute) ఉన్న సుమారు 3,73,524 ఎకరాల వ్యవసాయ భూమిని సెక్షన్ 22A కింద ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ భూముల క్రయవిక్రయాలపై పూర్తి నిషేధం ఉంటుంది.
జాబితా నుంచి మీ భూమిని తొలగించుకోవడం ఎలా?
మీ భూమి పొరపాటున లేదా ఏదైనా చిన్నపాటి వివాదం కారణంగా 22A జాబితాలో పడితే, దాన్ని పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. దీనికోసం అప్లికెంట్లు నేరుగా 'భూభారతి' (Bhubharati portal) ద్వారా సంబంధిత అధికారులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ అప్లికేషన్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి (Verification), ఆ భూమిని 22A లో కొనసాగించాలా లేదా మినహాయించాలా అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ పారదర్శక ప్రక్రియ ద్వారా 2023-24 సంవత్సరం నుంచి నేటి వరకు ఏకంగా 23,136 ఎకరాల భూమిని 22A జాబితా నుంచి ప్రభుత్వం విజయవంతంగా తొలగించి, రైతులకు ఊరటనిచ్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

‘22ఏ’ పంచాయితీ: సెక్రటేరియట్ వర్సెస్ తెలంగాణ భవన్.. భూపోరులో గెలుపెవరిది?
ఆగస్టు 21, 2026

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి
ఆగస్టు 12, 2026

Minister Ponguleti | భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణంలో రీ-సర్వే కీలక ఘట్టం
జులై 28, 2026
తాజావార్తలు
- ●స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్

స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్



