Telangana Budget | 12 గంటలకు సభ ముందుకు బడ్జెట్.. 9.30కి కేబినెట్ భేటీ
Telangana Budget | త్రినేత్ర.న్యూస్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను (Telangana Budget) అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభ ముందు ఉంచనున్నారు.
Telangana Budget | త్రినేత్ర.న్యూస్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను (Telangana Budget) అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభ ముందు ఉంచనున్నారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెడతారు. అయితే ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలుపనుంది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
గతేడాది రూ.3,04,965 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి అది రూ.3.26 లక్షల కోట్లకు పెరగనుందని సమాచారం. గత బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఈసారి ప్రధానంగా మూడు రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. సంక్షేమంతోపాటు వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక కేటాయింపులు చేయనున్నారు. వీటితో పాటు పంచాయతీరాజ్, ఆరోగ్యం, రహదారులు, మున్సిపల్, ఐటీ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి. శనివారం రంజాన్, ఆదివారం సెలవు కావడంతో ఆ రెండు రోజులు ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ వరకు సభ కొనసాగనుంది.
2025 -2026 బడ్జెట్ కేటాయింపులు ఇలా..
- పౌరసరఫరాలశాఖ - రూ.5,734 కోట్లు
- విద్యా రంగం - రూ.23,108 కోట్లు
- కార్మికశాఖ – రూ.900 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
- మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
- ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
- బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
- చేనేత రంగం - రూ.371 కోట్లు
- మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
- పరిశ్రమలు - రూ.3,527 కోట్లు
- ఐటీ రంగం - రూ.774 కోట్లు
విద్యుత్ రంగం - రూ.21,221 కోట్లు - వైద్య రంగం - రూ.12,393 కోట్లు
- పురపాలక రంగం - రూ.17,677 కోట్లు
- నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
- రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
- పర్యాటక రంగం - రూ.775 కోట్లు
- క్రీడలు - రూ.465 కోట్లు
- అటవీ, పర్యావరణం - రూ.1,023 కోట్లు
- దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
- హోంశాఖ – రూ.10,188 కోట్లు
- ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు
- రాజీవ్ యువ వికాసం- రూ.6వేలకోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
- గ్యాస్ సిలిండర్ రాయితీ- రూ.723 కోట్లు
- రాజీవ్ ఆరోగ్యశ్రీ- రూ.1,143 కోట్లు
- సన్నాలకు బోనస్ రూ.1,800 కోట్లు
- గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
- మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు
- ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు
- చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు
- రైతు భరోసా- రూ.18వేల కోట్లు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



