Harish Rao | రైతుల పేరుతో రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలు : హరీశ్‌రావు
Harish Rao | ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, దాన్నుంచి ప్రజల దృష్టించి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? ఆయన ప్రశ్నించారు.
Harish Rao | ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, దాన్నుంచి ప్రజల దృష్టించి మరల్చేందుకు రైతుల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. రైతు భరోసా పేరుతో పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ, రైతుల సమస్యలను పక్కన పెట్టి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రభుత్వం చేసింది ఏమిటి? ఆయన ప్రశ్నించారు. అవే చేతగాని మాటలు, చెత్త వాగుడు తప్ప కొత్తగా ఏమైనా ఒరిగిందా? అంటూ నిలదీశారు. ఒకే సభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబితే.. సీఎం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నాడని.. ఇద్దరిలో ఎవరి లెక్కలు నిజం? చేసింది లేదు కాబట్టే ఇష్టం ఉన్నట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి చేసిన మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82వేల కోట్లు అయితే.. జూన్ 2026 నాటికే రూ.1.56లక్షల కోట్లు, రూ.1.75లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో లేని డబ్బును ఖర్చు చేశారా? లేక రైతులను మభ్యపెట్టడానికి కల్పిత లెక్కలు చెబుతున్నారా? అంటూ నిలదీశారు.
అబద్ధాలు నిజాలు కావు..
అబద్ధాలను పదిసార్లు చెప్పినా అవి నిజాలు కావని, లేనివి ఉన్నట్లు చెప్పినంత మాత్రాన రైతులు నమ్ముతారా..? ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి ఓట్లు అడిగారని. ఇప్పుడు స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతులను మోసం చేయడం కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వల్పకాలిక రుణాలకే పరిమితం చేస్తామని ముందే చెప్పి ఉంటే రైతులు కాంగ్రెస్‌ను నమ్మేవారా?.. మేనిఫెస్టోలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిలువెత్తు నిదర్శనమంటూ ధ్వజమెత్తారు. ఫేక్ ప్రచారం చేసుకోవడం కాదని, రైతులకు ఇచ్చిన హామీల అమలు కావాలన్నారు. లేనిపక్షంలో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేశారో.. అన్నదాతను ఎలా మోసం చేసారో చర్చించేందుకు అసెంబ్లీ మాత్రమే కాదు.. ఏ వేదికలోనైనా తాము సిద్ధమేనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్






