త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja | వాట‌ర్ బాటిల్స్‌లో రూ. 3 కోట్ల గంజాయి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్

Ganja | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయి స్మ‌గ్ల‌ర్లు సరికొత్త‌గా వాట‌ర్ బాటిల్స్‌లో త‌ర‌లిస్తూ డీఆర్ఐ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు.

S

Hyderabad | Published On May 20, 2026, 5.11 pm IST

Ganja | వాట‌ర్ బాటిల్స్‌లో రూ. 3 కోట్ల గంజాయి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీజ్
Advertisement

Ganja | త్రినేత్ర‌.న్యూస్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయి స్మ‌గ్ల‌ర్లు సరికొత్త‌గా వాట‌ర్ బాటిల్స్‌లో త‌ర‌లిస్తూ డీఆర్ఐ అధికారుల‌కు అడ్డంగా దొరికిపోయారు. బ్యాంకాక్ నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి 8.705 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఇద్ద‌రు ప్ర‌యాణికులు అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో వారి ల‌గేజీని క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. ఈ క్ర‌మంలో వాటర్ బాటిల్స్, ఆలూ చిప్స్ డ‌బ్బాల్లో త‌ర‌లిస్తున్న 24 ప్యాకెట్ల‌ను గుర్తించారు. ప‌ట్టుబ‌డిన గంజాయి విలువ రూ. 3.05 కోట్లు ఉంటుంద‌ని డీఆర్ఐ అధికారులు స్ప‌ష్టం చేశారు. అనంత‌రం ప్ర‌యాణికులిద్ద‌రిని శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement