Condom Packet | బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. అవాక్కైన వినియోగదారుడు..
Condom Packet | బీరు బాటిల్‌లో (Beer Bottle) గుట్కా ప్యాకెట్లు, చేప పిల్లలే కాదు కండోమ్ ప్యాకెట్లు (Condom Packet) కూడా వస్తున్నాయి. మండే ఎండల నుంచి చల్లని బీరుతో ఉపశమనం పొందాలనుకున్న ఓ వ్యక్తికి ఆ సీసాలో ఏదో కదులుతూ కనిపించింది.
Condom Packet | త్రినేత్ర.న్యూస్: బీరు బాటిల్‌లో (Beer Bottle) గుట్కా ప్యాకెట్లు, చేప పిల్లలే కాదు కండోమ్ ప్యాకెట్లు (Condom Packet) కూడా వస్తున్నాయి. మండే ఎండల నుంచి చల్లని బీరుతో ఉపశమనం పొందాలనుకున్న ఓ వ్యక్తికి ఆ సీసాలో ఏదో కదులుతూ కనిపించింది. పరీక్షగా చూస్తే అది నిరోధ్ ప్యాకెట్. దీంతో అవాక్కవడం అతని వంతైంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలో జరిగింది.
భూంపల్లికి చెందిన ఓ వ్యక్తి వైన్స్ షాపులో కింగ్ ఫిషర్ లైట్ బీరు కొనుగోలు చేశారు. దాన్ని తాగబోతుండగా అందులో కండోమ్ ప్యాకెట్‌ను గమనించారు. వెంటనే మద్యం దుకాణం సిబ్బందిని ఇదేంటని అడిగితే తమకేం తెలవదు అంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అతడు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో కూడా అదే వైన్స్ షాపులో బీర్‌ను కొనుగోలు చేయగా.. అందులో నీరు మాత్రమే ఉందని ఆ వినియోగదారుడు తెలిపారు. కల్తీ మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బీరు సీసాలోకి ఆ ప్యాకెట్ ఎలా వచ్చింది?.. కావాలనే ఎవరైనా వేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
సంబంధిత వార్తలు

Haldi Vagu | పెండ్లికి వెళ్లివస్తూ.. హల్దీ వాగులో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి..
మే 7, 2026

Minister Sridhar Babu | “బేకర్ హ్యూస్”ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ఏప్రిల్ 23, 2026

Harish Rao | సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.. తెలంగాణకు దక్కిన గౌరవం: హరీశ్ రావు
ఏప్రిల్ 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



