Bellampalli Election Results 2026 | బెల్లంపల్లిలో ‘కారు’ జోరు.. మున్సిపల్ పీఠం గులాబీదే?
బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. హంగ్ ఏర్పడిన నేపథ్యంలో.. కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ కౌన్సిలర్ కూడా మద్దతు తెలపడంతో బెల్లంపల్లి చైర్మన్ పీఠం గులాబీ ఖాతాలో పడే అవకాశాలు మెరుగుపడ్డాయి.
- కాంగ్రెస్‌కు బిగ్ షాక్
- కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన ఇతర పార్టీల కౌన్సిలర్లు
Bellampalli Election Results 2026 | త్రినేత్ర.న్యూస్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 'హంగ్' ఏర్పడటంతో ఉత్కంఠ నెలకొన్న వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఇతర పార్టీల కౌన్సిలర్లు కారు ఎక్కడంతో బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది.
కేటీఆర్ సమక్షంలో చేరికలు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నుంచి 26వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బీజేపీ కౌన్సిలర్ మద్దతు
మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిశారు. ఆయన బీఆర్ఎస్కు తన మద్దతును ప్రకటించారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ తగిలినట్లయింది.

మారిన లెక్కలు - బీఆర్ఎస్ బలం 17
తాజా చేరికలతో మున్సిపాలిటీలో బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. మొత్తం 34 స్థానాలు ఉన్న బెల్లంపల్లిలో మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. తాజా చేరికలతో బీఆర్ఎస్ బలం 14 నుంచి 17కు చేరింది. కాంగ్రెస్‌కి 14, ఇండిపెండెంట్లు 5, బీజేపీ ఒక స్థానంలో గెలిచాయి. ఎక్స్-అఫీషియో ఓట్ల మద్దతు కూడా తోడైతే బెల్లంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్ వశం కావడం లాంఛనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Balmuri Venkat vs Harish Rao | బీఆర్ఎస్ బతుకుతుందా? బీజేపీలో కలపాలా? : హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ ఫైర్
ఏప్రిల్ 28, 2026

Telangana Municipal Election Results 2026 | మున్సిపల్ పీఠాలపై ‘హస్తం’ జెండా.. లాటరీలోనూ కాంగ్రెస్‌దే లక్కు..!
ఫిబ్రవరి 17, 2026

Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్.. బాంబు పేల్చిన మంత్రి పొంగులేటి
ఫిబ్రవరి 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



