Balmuri Venkat vs Harish Rao | బీఆర్ఎస్ బతుకుతుందా? బీజేపీలో కలపాలా? : హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ ఫైర్
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ విప్ బల్మూరి వెంకట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాప్ చేసిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Balmuri Venkat vs Harish Rao | త్రినేత్ర.న్యూస్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీశ్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తీరుపై, ముఖ్యంగా హరీశ్ రావు వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. "చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఎలా బతికించుకోవాలి? అసలు ఆ పార్టీ రాష్ట్రంలో బతుకుతుందా లేదా? లేక ఆ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయాలా? అన్న కన్ఫ్యూజన్‌లో, దిక్కుతోచని స్థితిలో హరీశ్ రావు కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక, తీవ్ర నైరాశ్యంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు" అని వెంకట్ విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్‌పై ఘాటు కౌంటర్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు చేసిన ఆరోపణలకు వెంకట్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
"గత పదేళ్లుగా అధికార మదంతో, అహంకారంతో అధికారులను అడ్డం పెట్టుకుని మీరే అందరి ఫోన్లను ట్యాప్ చేయించారు. మీరు చేసిన ఆ పనులే ఇప్పుడు ప్రజా ప్రభుత్వం కూడా చేస్తోందన్న భ్రమలో మతిలేని మాటలు మాట్లాడుతున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీ సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించిన నీచమైన చరిత్ర మీది. మీ మరదలు కవితనే స్వయంగా బయటకొచ్చి మీపై ఆరోపణలు చేసిన విషయం వాస్తవం కాదా? ఆమె చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు లేదు" అంటూ సవాల్ విసిరారు.
తీరు మార్చుకోకపోతే ప్రజలు తరిమికొడతారు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే హరీశ్ రావు ఇలాంటి విషపు మాటలు మాట్లాడుతున్నారని విప్ వెంకట్ ఆరోపించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకనే గత ఎన్నికల్లో ప్రజలు వారిని చిత్తుగా ఓడించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా హరీశ్ రావు తన మాట తీరు మార్చుకోకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలు తన్ని తరిమేసే పరిస్థితి వస్తుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Harish Rao | భట్టి గారూ.. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవ్
జులై 4, 2026

Vemula Prashanth Reddy | జూపల్లి వస్తడేమోనని టీవీల్లో చూశా.. కానీ పత్తకు రాలే
జులై 3, 2026

Jupally Krishna Rao | మీరు ఏం చేస్తారో చెప్పండి.. 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వస్తా.. కేటీఆర్, హరీశ్‌కు మంత్రి జూపల్లి సవాల్
జులై 3, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



