IVPA Global Round Table Meeting | గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రండి.. తుమ్మలకు ఐవీపీఏ ప్రతినిధుల ఆహ్వానం
IVPA Global Round Table Meeting | హైదరాబాద్ (Hyderabad)లో ఐవీపీఏ (IVPA) గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఐవీపీఏ ప్రతినిధులు తుమ్మల నాగేశ్వర్‌రావుకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.
IVPA Global Round Table Meeting | త్రినేత్ర న్యూస్: ఈనెల 30న హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించనున్న ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రావాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు (Thummala Nageshwar Rao)ను అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు భవిష్యత్తు, రైతుల అభ్యున్నతి, పంట ఉత్పాదకత పెంపు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రసంగించాలని కోరారు. ఈమేరకు మంగళవారం సచివాలయంలో తుమ్మలను కలిసి ఆహ్వానించారు.
ఆయిల్ పామ్ కంపెనీలకు పూర్తి సహకారం: మంత్రి తుమ్మల
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగును చేపడుతున్న అన్ని కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. గోద్రెజ్, పతంజలి, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని, ఆయా కంపెనీల కార్యకలాపాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొన్నారు.
ఇటీవల గోద్రెజ్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్ పామ్ విత్తనాల అభివృద్ధి కోసం సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని, ఇందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు. తెలంగాణలో ఆయిల్ పామ్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఇతర ప్రముఖ కంపెనీలు సైతం తెలంగాణలో ఆయిల్ పామ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
ప్రస్తుతం ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత, పంటల సాగు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశీయంగా వంట నూనెల అవసరాలను తీర్చుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగు విస్తరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తుమ్మల వెల్లడించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం
నవంబర్ 3, 2026

Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
నవంబర్ 3, 2026

Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
నవంబర్ 3, 2026
తాజావార్తలు
- ●GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం
- ●SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!
- ●NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!
- ●Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన
- ●Indiramma Illu | సొంత భూమి ఉంటే.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం
- ●Cyclone MURASU Effect | మురాసు తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

GHMC Street Lights | జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్‌లో కుంభకోణం.. బెంచ్ మార్క్ ధరకు 4.49 శాతం అధికం

SD Pay App Scam | నెలకు 9% లాభమంటూ నమ్మించారు.. 6.5 లక్షల మందిని ముంచి 1200 కోట్లు కొల్లగొట్టారు!

NEET PG | నీట్ పీజీ ప్రవేశాల్లో కీలక మార్పులు!

Cyberabad Traffic Police | రేపు, ఎల్లుండి త్వరగా లాగౌట్ అవ్వండి.. టెకీలకు సైబరాబాద్ పోలీసుల సూచన




