KTR | ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఎవరి కోసం, దేని కోసం?
KTR | క్రాప్, పవర్ హాలిడేలతో పాటు అన్ని హాలిడేలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఎవరి కోసం పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
- కరెంటు, నీళ్లు లేవని పెట్టుబడిదారులకు చెబుతారా?
- ఎంవోయూలు, సమ్మిట్‌లపై వైట్ పేపర్ రిలీజ్ చేయండి
- అన్నిటికి హాలిడేలిస్తున్న ఈ ప్రభుత్వానికి హాలిడే ఇస్తే దరిద్రం పోతది
- ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్
- ఓ వైపు పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?
- డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్
- 365 కరువు మండలాలు ఉండటానికి కారణం రేవంత్ రెడ్డే
- మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | త్రినేత్ర న్యూస్: క్రాప్, పవర్ హాలిడేలతో పాటు అన్ని హాలిడేలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 365 కరువు మండలాలు ఉండడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమన్నారు. ఈ కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ (Global Summit) ఎవరి కోసం పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ అని గొప్పలు చెప్పిన రేవంత్ ఇప్పుడు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులు తమ పొలాలను తగల పెట్టుకోవడమే కాంగ్రెస్ తెచ్చిన అసలైన మార్పు అని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతరా?
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి? ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు? పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్‌ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా?
రాష్ట్రంలో ఒకవైపు కరువు ఉందని చెబుతూనే, మరోవైపు మూసీ సుందరీకరణ చేస్తాడట. మూసీ ప్రాజెక్ట్ బాధితుల కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే బీఆర్ఎస్ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజలు, బాధితులు లేకుండా, ప్రజల గొంతును నొక్కుతూ పబ్లిక్ హియరింగ్ ఎలా నిర్వహిస్తారు? రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? అనుముల రేవంత్ రాజ్యాంగం ఉందా? రైతులు తమ పొలాలు తగలపెట్టుకోవడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు.
అందుకే ఏపీలో కరువు లేదు..
క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, కన్స్‌ట్రక్షన్ హాలిడే, 420 హామీలకు హాలిడే. అన్నిటికి హాలిడే ఇస్తున్న ఈ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలి. మీ ట్యాంకర్లు మీరే తెచ్చుకోండి, మీ కరెంట్ మీరే తెచ్చుకోండి, మీ పంటను మీరే కాపాడుకోండి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి మన నెత్తిన రుద్దిన కరువు. 4 నెలల నుండి మేం చెప్పినా, రేవంత్ రెడ్డి నీళ్ళు ఎత్తలేడు. గోదావరిలో 750 టీఎంసీలు, కృష్ణాలో 250 టీఎంసీల నీళ్ళు కిందకి వదిలారు.. ఆ నీళ్ళు చంద్రబాబు నాయుడు వాడుకున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కరువు లేదు.. తెలంగాణలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో, కర్ణాటకలో మన దగ్గరికంటే తక్కువ వర్షాలు పడ్డ కరువు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 35% వర్షపాతం లోటు ఉంది.. కర్ణాటకలో 30% ఉంది. రేవంత్ రెడ్డి తాను తెచ్చిన కరువు గురించి ప్రకటనలు గుప్పిస్తున్నాడు. రేవంత్ మనపై రుద్దుతున్న కరువు ఇది. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఏర్పడింది. జెనరేటర్లు, ట్యాంకర్లతో తెలంగాణ రైతులు పంటలు కాపాడుకుంటున్నారు.420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రజలకు నిరాశే మిగిలింది. రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితి, పరిశ్రమలు కరెంట్ కోతలతో ఇబ్బందులు పడే పరిస్థితి, ఉద్యోగులు తమ హక్కుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. మూసీ సుందరీకరణ పేరుతో చేపట్టిన ప్రాజెక్టును వెంటనే నిలిపివేసి, ఆ లక్షన్నర కోట్ల రూపాయలను ప్రజల సంక్షేమానికి, రైతుల ఉపశమనానికి వినియోగించాలి.
ఎవరు అడిగారు మూసీ సుందరీకరణ? డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాలను వెంటనే బంద్ చేయాలి. ఎలాంటి నివేదికలు, ప్రజల అంగీకారం లేకుండా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేదు. ఒకవైపు ప్రజలను నరకయాతనకు గురిచేస్తూ, హాలిడేల పేరుతో వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు, రేవంత్ రెడ్డి తదితరులు కమీషన్లతో జాలీ డేస్ గడుపుతున్నారు.
తాగునీటికి కష్టాలు ఉన్నప్పటికీ రూ.1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా, తాగునీటి ఎద్దడి ఉన్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు కేటాయించి దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టడం విచిత్రంగా ఉంది.
రైతుబంధు నిధులు పూర్తి స్థాయిలో అందకపోవడం, రైతు బీమా పథకం నిలిచిపోవడం, పెన్షన్లు, నిరుద్యోగ భృతి అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేసుకుంటే మీ కర్మ అనేలా కాంగ్రెస్ పాలన ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగి మూడేండ్లు అవుతున్నా, ప్రభుత్వం దానిపై ఎలాంటి విచారణ జరపకుండా కేవలం కాలయాపన చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించకుండా, రైతులకు నీళ్లు అందించకుండా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది.
కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదు
రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించడం వల్ల పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. కరెంట్ కోతలతో ఇండస్ట్రీలు మూతపడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంట్ ఉంటే కాంగ్రెస్ ఉండదు అనేది ఈరోజు నిజమవుతోంది. రాష్ట్రం రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారింది. రాష్ట్రంలో ఇంత అవినీతి, కరువు కాటకాలు, పరిపాలనా వైఫల్యం ఉన్నప్పటికీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ స్పందించడం లేదు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, రైతుల కష్టాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు స్పందించడం లేదు?
రాష్ట్రం కరువుతో, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో గోబెల్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు పొదుపు మంత్రం పాటించాలని చెబుతూ, వందల కోట్ల రూపాయలు ప్రచారం కోసం, ఫ్లెక్సీల కోసం, ప్రకటనల కోసం దుబారా చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం తీసుకురాలేకపోయింది. రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. తాము దిగిపోయేనాటికి 9,46,000గా ఉన్న ఐటీ ఉద్యోగాలు.. కాంగ్రెస్ సర్కారు వచ్చాక 7,000 వరకు తగ్గాయని ప్రభుత్వం ఒప్పుకుంది.
గ్లోబల్ సమ్మిట్ పేరుతో వేల కోట్ల రూపాయలను తమ ప్రచారం కోసం వృథా చేస్తున్నారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ వల్ల ఒక్క పెట్టుబడి, ఒక్క ఉద్యోగం రాలేదు. అందుకే అది గోబెల్స్ సమ్మిట్. గతంలో తాము ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే పదేళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తేగలిగాం. పెట్టుబడులు తీసుకురావడానికి ప్రచార ఆర్భాటాలు అవసరం లేదు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, విద్యుత్, నీటి సౌకర్యాలు, స్థిరమైన విధానాలు ఉండాలి అని కేటీఆర్ సూచించారు.
కొండా సురేఖ క్షమాపణలపై స్పందన
నిజం నిలకడ మీదే తేలుతుంది. మొన్న ఈనాడు వార్తా పత్రిక క్షమాపణ చెప్పింది. ఈరోజు ఈ సురేఖ మేడం చెప్పింది. ఇంకా క్షమాపణలు చెప్పే వాళ్లు చాలా మంది ముందు వరుసలో ఉన్నారు. మా మీద ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసే వారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా అని, లేకపోతే విద్యుత్ కుంభ కోణమని ఏదేదో మాట్లాడుతున్నరు. ఇవన్నీ దూదిపింజల్లాగ తేలిపోయిన తర్వాత ఇంకా చాలా మంది క్షమాపణలు చెప్తరు. ఆమె ఏం చెప్పారో నేన్ చూడలేదు. చూసిన తర్వాత మా లీగల్ టీంతో మాట్లాడతా. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao | మల్లన్న సాగర్‌ను కూల్చేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్ర
అక్టోబర్ 29, 2026

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
అక్టోబర్ 29, 2026

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...
- ●Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు
- ●Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?
- ●CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?
- ●Jason Sanjay | హీరోగా దళపతి విజయ్ కొడుకు - రంగంలోకి అల్లు అర్జున్ డైరెక్టర్
- ●Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ షేర్ల ర్యాలీ.. రెండు రోజుల్లో 33 శాతం లాభాలు..

Trisha | త్రిష తెలుగు వెబ్‌సిరీస్ - సినిమాల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్...

Super El Nino | సూపర్ ఎల్‌నినో ముప్పు.. మార్చి నాటికి భారత్‌లో 55,000 మరణాలు

Hyundai Bayon | హ్యుందాయ్ బయాన్ ఎస్యూవీ వచ్చేసింది.. ధరలు ఎంతంటే?

CEC Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై అవినీతి దర్యాప్తు: కేరళం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రూ.700 కోట్ల రోడ్డు ప్రాజెక్టులో ఏం జరిగింది?



