Bandi Sanjay | బండి సంజయ్ .. ఎవరిని బెదిరిస్తున్నవ్ ?
Bandi Sanjay | 'బండి సంజయ్.. నీకు ఫ్రస్ట్రేషన్ పీక్‌కు వెళ్లిపోయింది. నీ కొడుకు తప్పు చేసిండు. పోక్సో కేసు పెట్టిండ్రు. నీకు ఇప్పుడు బాధ అయితున్నది. నీ ఇంట్ల బాధ రాష్ట్రానికి సమస్య అయితదా? అని బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు.
నీ కొడుకు పాడైపోయింది నీ మాటలతోనే కదా
నీ ఇంట్లో సమస్య రాష్ట్ర సమస్య అయితదా
నీకు ఫ్రస్ట్రేషన్ పీక్ కు వెళ్లిపోయింది
ఆనాడే నీ కొడుకును అదుపులో పెట్టి ఉంటే
ఇవాళ ఆ అమ్మాయికి అన్యాయం జరిగేది కాదు
ప్రతి పోక్సో కేసుకు సిట్ వేస్తారా?
సిట్ వేసి ఏం చెప్పదలుచుకున్నారు?
కొత్తగా వచ్చిన అమ్మలు ఇంకా స్పందిస్తలేరు
ప్రెస్ మీట్‌లో మండిపడిన మాజీ మంత్రులు గంగుల, సత్యవతి, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Bandi Sanjay | త్రినేత్ర.న్యూస్ : 'బండి సంజయ్.. నీకు ఫ్రస్ట్రేషన్ పీక్‌కు వెళ్లిపోయింది. నీ కొడుకు తప్పు చేసిండు. పోక్సో కేసు పెట్టిండ్రు. నీకు ఇప్పుడు బాధ అయితున్నది. ఇక నువ్వు.. నన్ను కెలికిండ్రు. మీ అంతు చూస్తా. ఎవ్వరిని వదిలిపెట్ట...అని అంటున్నవ్. నీ ఇంట్ల బాధ రాష్ట్రానికి సమస్య అయితదా? నీ మాటలతోనే కదా నీ కొడుకు చెడిపోయింది. కాలేజీలో ర్యాగింగ్ పనులకు పాల్పడిన నాడే నీ కొడుకును అదుపులో పెట్టుకొని ఉంటే.. ఇవాళ ఆ అమ్మాయికి అన్యాయం జరిగి ఉండేది కాదు. ముందు నీ కొడుకును పోలీసులకు అప్పగించు' అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ అన్నారు
తన ఇంట్లో సమస్యను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర సమస్యగా మారుస్తున్నారని బీఆర్ ఎస్ నేతలు ఆక్షేపించారు. తాను ఎవ్వరినీ వదిలిపెట్టనని ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ.. కరీంనగర్ లో మంగళవారం రాత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బుధవారం తెలంగాణ భవన్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ లు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..
ఇది కులాల సమస్య కాదు : మాజీ మంత్రి గంగుల
బండి సంజయ్ కుమారుడు చేసిన అఘాయిత్యంలో.. బీఆర్ ఎస్ ..బాధితురాలి పక్షానే ఉంది. మా పార్టీ నేతల ఒత్తిడి తోనే బండి భగీరథ్ పై కేసు నమోదు చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కులాల సమస్య కాదు. లా ఆండ్ ఆర్డర్ సమస్య. మంగళవారం రాత్రి కరీంనగర్ లో బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. చట్టానికి , పోలీసులకు బండి సంజయ్, ఆయన కుమారుడు సహకరించాలి.
ఎవరి అంతు చూస్తావ్: మాజీ మంత్రి సత్యవతి
మొన్న మీటింగ్ కు వచ్చిన ప్రధానమంత్రి మోదీ.. బండి సంజయ్ ను ఎందుకు మందలించలేదు. బండి సంజయ్ తన కొడుకును అదుపులో పెట్టుకోలేదు. ఆయన మాటల వల్లే కదా.. ఆయన కొడుకు చెడిపోయింది. మరోవైపు బండి సంజయ్ గాలి మాటలు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలి.మోదీ హైదరాబాద్ కు వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
అప్పుడు గుర్తు రాలేదా: ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
కరీంనగర్ లో నగల షాప్ లో దొంగతనం జరిగినా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసినా ఇప్పటివరకు పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు. ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్,బీజేపీ ఒక్కటి అయ్యాయి.పోక్సో కేసు నమోదు అయితే ప్రతి సారి సిట్ వేస్తారా. క్యాంపు కార్యాలయాలపై దాడులు మంచి సంప్రదాయం కాదు. నీ కుటుంబంలో సమస్య వస్తే ఎదుటి వాళ్ళ బాధలు బండి సంజయ్ కు ఇప్పుడు అర్ధం అవుతున్నాయా? అమ్మాయికి న్యాయం చేయాలని బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది. బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారు. కుటుంబం బాధ బండి సంజయ్ కు ఎదుటి వారిని అనేటప్పుడు గుర్తు రాలేదా?
అంతుచూస్తా అంటే కేసు పెట్టరా? : ఎమ్మెల్సీ శంభీపూర్
బండి సంజయ్ ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ నే టార్గెట్ గా చేసుకొని మాట్లాడుతున్నారు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపున ఉంటుంది. కాంగ్రెస్,బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో కేటిఆర్ పై ఎన్ని రంకులు అంటగట్టారు. కేటీఆర్ పై బండి సంజయ్ మాట్లాడిన మాటలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడరు. అంతుచూస్తా అని బండి సంజయ్ అంటే కేసు ఎందుకు పెట్టలేదు. వరంగల్ లో కేటిఆర్ మాట్లాడితే కేసులు పెట్టారు కదా..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






