త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | నాసిక్ ల‌వ్ జిహాద్ కేసు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ కీలక సూచన..

Bandi Sanjay | ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (TCS)కు చెందిన నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మ‌త మార్పిడులు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) తెలంగాణ ప్ర‌భుత్వానికి కీల‌క సూచ‌న‌లు చేశారు.

G

Telangana | Published On Apr 13, 2026, 10.13 am IST

Bandi Sanjay | నాసిక్ ల‌వ్ జిహాద్ కేసు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ కీలక సూచన..
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (TCS)కు చెందిన నాసిక్ యూనిట్‌లో లైంగిక వేధింపులు, మ‌త మార్పిడులు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) తెలంగాణ ప్ర‌భుత్వానికి కీల‌క సూచ‌న‌లు చేశారు. అన్ని ప్రధాన ఐటీ కంపెనీల అధిపతులతో, ముఖ్యంగా హెచ్‌ఆర్ బృందాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలని డీజీపీని కోరారు. త‌మ‌ వంతుగా కేంద్రం కూడా ఇలాంటి సమస్యలను పర్యవేక్షిస్తూనే ఉంటుంద‌ని చెప్పారు. కార్పొరేట్ జిహాద్ కేసు నేప‌థ్యంలో తెలంగాణ వంతు విస్మరించలేనిద‌న్నారు.

`హైదరాబాద్‌లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఆఫీస్ క్యాంప‌స్‌లు ఉద్యోగుల‌ కెరీర్ కోసం ఉండాలి, అంతేగానీ బలవంతం, వేధింపులు, మతపరమైన లక్ష్యాలు, దోపిడీ, రహస్య ఒత్తిడి నెట్‌వర్క్‌ల కోసం కాదు. కఠినమైన జవాబుదారీతనాన్ని అమలు చేయండి. ఏ ఫిర్యాదునూ కప్పిపుచ్చకూడదు. ఏ బాధితుడినీ ఒంటరిని చేయకూడదు. ఏ యాజమాన్యం కూడా చూసిచూడనట్లు వ్యవహరించకూడదు. చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాల్లోని సంఘటనలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ హెచ్చరిక సంకేతాలను విస్మరించవద్దు. కంపెనీ అధిపతులు, హెచ్‌ఆర్‌లు, మేనేజర్లు ఉద్యోగుల భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బహిరంగంగా ఫిర్యాదు చేయడాన్ని ప్రోత్సహించాలని, ప్రతి సమస్యను తీవ్రంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం` అన్నారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌పై టీసీఎస్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ సిన‌ట్లు పేర్కొంది. నాసిక్ విషయం త‌మ‌ దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నామని కంపెనీ ప్ర‌తినిధి తెలిపారు. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశామ‌న్నారు. తాము అధికారులకు సహకరిస్తున్నామ‌ని, ఈ విచారణ ముగింపు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement