Digital System | మద్యం దుకాణాలకు డిజిటల్ హంగులు
Digital System | తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ సంస్థ టాస్మాక్ (TASMAC) కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ ఒకటి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో స్టాక్ ఆర్డర్ల కోసం ప్రస్తుతం ఉన్న పేపర్ పద్ధతికి స్వస్తి పలికి.. పూర్తిగా డిజిటల్ విధానాన్ని అమలు చేయబోతున్నది.
- సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు
- కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్న తమిళనాడు టాస్మాక్
- హ్యాండ్‌హెల్డ్ పరికరాలతోనే మద్యం స్టాక్ ఆర్డర్లు..
- పేపర్ రహిత ప్రక్రియతో సరఫరాలో పారదర్శకత
Digital System | తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం విక్రయ సంస్థ టాస్మాక్ (TASMAC) కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ ఒకటి రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో స్టాక్ ఆర్డర్ల కోసం ప్రస్తుతం ఉన్న పేపర్ పద్ధతికి స్వస్తి పలికి.. పూర్తిగా డిజిటల్ విధానాన్ని అమలు చేయబోతున్నది. దుకాణాల సూపర్‌వైజర్లు ప్రత్యేక హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా స్టాక్ అవసరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. టాస్మాక్ మేనేజింగ్ డైరెక్టర్ కే నందకుమార్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. స్టాక్ పంపిణీని క్రమబద్ధీకరించడం, కాగితపు పనిని తొలగించడం, సరఫరాలో జాప్యాలు, కొరతలను అధిగమించడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. తమిళనాడులోని 38 జిల్లాలు, డిపోలను ఎండ్ టు ఎండ్ కంప్యూటరీకరించే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. తాజా విధానంతో మానవ తప్పిదాలు, స్టాక్ నిర్వహణలో లోపాలకు మరింతగా అడ్డుకట్ట పడనుంది.
20 శాతం అదనంగా ఆర్డర్ చేసుకోవచ్చు..
కొత్త విధానంలో ప్రతి దుకాణానికి బ్రాండ్, ప్యాక్ పరిమాణం ఆధారంగా ఎంత స్టాక్ తీసుకోవాలో హ్యాండ్‌హెల్డ్ పరికరంలోనే ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఆ పరిమాణాన్ని సూపర్‌వైజర్లు తగ్గించడానికి వీలుండదు. స్థానికంగా డిమాండ్ అధికంగా ఉంటే నిర్ణయించిన పరిమాణానికి అదనంగా 20 శాతం వరకు ఆర్డర్ చేసుకోవచ్చు. వినియోగదారుల్లో ఆదరణ ఉన్న ఏదైనా బ్రాండ్ ఆటోమేటిక్ జాబితాలో లేకపోతే.. దానినీ స్థానిక డిమాండ్ ఆధారంగా జోడించే అవకాశం ఉంటుంది. స్టాక్ ఆర్డర్‌ను తుది దశలో సమర్పించేందుకు సూపర్‌వైజర్ నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)తో ధ్రువీకరణ తప్పనిసరి.
డిపోకు నేరుగా సమాచారం..
ఇకపై జిల్లా మేనేజర్ కార్యాలయాలకు ఫిజికల్ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. డివైజ్‌లో పరిమాణాన్ని నిర్ధారించిన తర్వాత అదే తుది ఆర్డర్‌గా పరిగణించి స్థానిక డిపోకు పంపిస్తారు. అక్కడి నుంచి దుకాణాలకు స్టాక్ పంపిణీ జరుగుతుంది. దుకాణానికి చేరిన సరుకును సూపర్‌వైజర్ భౌతికంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంతో విక్రయాల వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి రావడంతో.. ఏ ప్రాంతంలో ఏ బ్రాండ్‌కు ఎంత డిమాండ్ ఉందన్నది స్పష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగ్గ బ్రాండ్లను దుకాణాలకు సరఫరా చేసే అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం డిజిటల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జిల్లా మేనేజర్లు సంతకం చేసిన ముద్రిత ప్రతులతో వ్యవస్థలోని వివరాలను సరిపోల్చి పరిశీలిస్తున్నారు. సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం తప్పనిసరి కానుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి




