త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | ఎంపీ ఈట‌ల రాజేందర్‌కు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితుడు బండి సంజయ్ అనుచరుడే

Eatala Rajender | మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌కు (Eatala Rajender | ) వ్య‌తిరేకంగా వెల‌సిన‌ ఫ్లెక్సీల వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. ఆ ఫ్లెక్సీలు పెట్టింది బీజేపీ (BJP) నేతేన‌ని, అత‌డు క‌రీంన‌గ‌ర్ ఎంపీ, కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అనుచ‌రుడ‌ని తేలింది.

G

Telangana | Published On Jun 8, 2026, 10.22 am IST

Eatala Rajender | ఎంపీ ఈట‌ల రాజేందర్‌కు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితుడు బండి సంజయ్ అనుచరుడే
Advertisement

Eatala Rajender | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌కు (Eatala Rajender | ) వ్య‌తిరేకంగా వెల‌సిన‌ ఫ్లెక్సీల వ్య‌వ‌హారం కీల‌క మ‌లుపు తిరిగింది. ఆ ఫ్లెక్సీలు పెట్టింది బీజేపీ (BJP) నేతేన‌ని, అత‌డు క‌రీంన‌గ‌ర్ ఎంపీ, కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అనుచ‌రుడ‌ని తేలింది.

ఎంపీ ఈట‌ల రాజేందర్‌పై అనుచిత ఆరోపణలు చేస్తూ మ‌ల్కాజిగిరి, కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్‌బీ కాలనీ, ఔటర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎంపీలు ఈట‌ల‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్ మధ్య గొడవలు ఉన్నట్లు ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో కూకట్‌పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. శ‌నివారం ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వారిలో జన్యావుల రామకృష్ణ, గాజుల రాకేష్ (రామకృష్ణ పీఏ), సయ్యద్ కుద్రుత్ అహ్మద్, సయ్యద్ మెహ్రాజ్, షేక్ కలీం, నజీర్ ఉద్దీన్ ఉన్నారు. ప్ర‌ధాన నిందితుడు రామ‌కృష్ణ బీజేపీ నాయకుడ‌ని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశార‌ని, అత‌డు కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడ‌ని తేల్చారు.

కాగా, పోక్సో కేసు వివాదంలో త‌న ఇమేజ్‌ డ్యామేజ్ చేసింది ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ అని బలంగా నమ్ముతూ బండి సంజయ్ వారి మీద ఫ్లెక్సీలు వేయించాడని బీజేపీ కార్య‌క‌ర్త‌లు చర్చించుకుంటున్నాయి.

పార్టీ నుంచి సస్పెండ్..

మ‌రోవైపు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో రామ‌కృష్ణ‌పై బీజేపీ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీ ఈట‌ల రాజేందర్‌కు వ్యతిరేకంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో రామకృష్ణ పాత్రపై ఆరోపణలు రావ‌డంతో పార్టీ అధిష్ఠానం ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Advertisement
Advertisement