Horror OTT | తెలుగులో రిలీజైన తమిళ హారర్ మూవీ – క్షుద్ర పూజల కథతో – ఏ ఓటీటీలో చూడాలంటే?
తమిళ హారర్ మూవీ సాతాన్ ది డార్క్ తెలుగులోకి వచ్చింది. సోమవారం డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. సాతాన్ మూవీలో చాందిని తమిళరాసన్, ఐరా కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Jun 8, 2026, 12.23 pm IST
Horror OTT | తమిళ మూవీ సాతాన్ ది డార్క్ తెలుగులో నేరుగా ఓటీటీలో రిలీజైంది. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో చాందిని తమిళ రాసన్, ఫెడ్రిక్ జాన్, ఐరా కీలక పాత్రలు పోషించారు. మణికందన్ రామలింగం దర్శకత్వం వహించాడు.
అమెజాన్ ప్రైమ్....
తమిళంలో హారర్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ తాజాగా తెలుగులోకి వచ్చింది. సోమవారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజైంది.ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి సంబంధించి కాన్సెప్ట్, చాందిని తమిళరాసన్ యాక్టింగ్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. క్షుద్రపూజల కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు ఐరా ఓ నిర్మాతగా వ్యవహరించింది.
ఊరిని వెంటాడిన శాపం...
హస్తినాపురం ఊరిని బ్రిటీష్ కాలం నుంచి ఓ శాపం వెంటాడుతుంది. ఆ ఊరికి చెందిన మెర్సిలినాను ఓ ఆత్మ ఆవహిస్తుంది. రక్తదాహంతో రగిలిపోయే ఆ ఆత్మ కారణంగా ఊరు మొత్తం ప్రమాదంలో పడుతుంది. మెర్సిలినా కూతురు అలీషా ఆ ఆత్మ బారి నుంచి తన తల్లిని ఎలా కాపాడుకుంది? ఆమెకు సాయం చేసిన సాగర్ ఎవరు? ఊరిని వెంటాడుతున్న శాపం ఏమిటి? అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో...
సాతాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన చాందిని తమిళరాసన్ తెలుగులో చాలానే సినిమాలు చేసింది. కాళిచరణ్, బుజ్జి ఇలా రా, లవర్స్, కిరాక్‌తో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపించింది.
తాజావార్తలు
- ●TGSPDCL Electricity Bill Calculation | మీ కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? ఏం చార్జీలు వేస్తారో తెలుసా?
- ●IND vs AFG | 152 రన్స్‌కే అఫ్గాన్ ఆలౌట్.. డెబ్యూ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ సత్తా
- ●Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలంగాణలోకి ఎప్పుడంటే..
- ●Donlad Trump | నెతన్యాహుకు వేరే దారి లేదు.. ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే : డొనాల్డ్ ట్రంప్
- ●Israel Strikes Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు: ట్రంప్ మాటను పక్కనపెట్టి.. టెహ్రాన్‌లో పేలుళ్ల మోత!
- ●Compact Smart Phones | పాకెట్లలో సులభంగా ఇమిడిపోతాయి.. చిన్న సైజులో ఉన్నా ఈ ఫోన్లు పనితీరులో భేష్..

TGSPDCL Electricity Bill Calculation | మీ కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా? ఏం చార్జీలు వేస్తారో తెలుసా?

IND vs AFG | 152 రన్స్‌కే అఫ్గాన్ ఆలౌట్.. డెబ్యూ మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ సత్తా

Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలంగాణలోకి ఎప్పుడంటే..

Donlad Trump | నెతన్యాహుకు వేరే దారి లేదు.. ఇరాన్‌తో ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే : డొనాల్డ్ ట్రంప్






