త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Southwest Monsoon | నైరుతి రుతుప‌వ‌నాలు వ‌చ్చేస్తున్నాయ్‌.. తెలంగాణ‌లోకి ఎప్పుడంటే..

Southwest Monsoon | దేశ‌వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. రానున్న‌ రెండు మూడు రోజుల్లో ఇవి మరింత వేగం పుంజుకొని తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లోకి విస్త‌రించే అవ‌కాశాలున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

S

Telangana | Published On Jun 8, 2026, 12.26 pm IST

Southwest Monsoon | నైరుతి రుతుప‌వ‌నాలు వ‌చ్చేస్తున్నాయ్‌.. తెలంగాణ‌లోకి ఎప్పుడంటే..
Advertisement

Southwest Monsoon | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. రానున్న‌ రెండు మూడు రోజుల్లో ఇవి మరింత వేగం పుంజుకొని తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌లోకి విస్త‌రించే అవ‌కాశాలున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. అనంత‌రం నాలుగైదు రోజుల త‌ర్వాత ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా, ఉప హిమాల‌య, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, ఈశాన్య భార‌త్‌లోని ఇత‌ర రాష్ట్రాల‌కు చేరుకుంటాయ‌ని ఐఎండీ పేర్కొంది.

ఇప్పటికే గోవా, తమిళనాడులను రుతుపవనాలు కప్పేయ‌గా గ‌త‌ శనివారం నాటికి మహారాష్ట్ర, ఆంధ్రకు విస్తరించాయి. అరేబియా సముద్రంలో పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య ప్రాంతాలు, కర్ణాటక సహా బంగాళాఖాతంలో ఎక్కువ భాగం రుతుపవనాల విస్త‌రించి ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన‌ మిజోరం, మణిపూర్‌లలోకి కూడా ప్రవేశించి ఉత్తర దిశగా స్థిరంగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. కాగా గడిచిన 48 గంటల్లో కేరళ, కర్ణాటక తీరప్రాంతం, మేఘాలయ, ఒడిశా, బీహార్, అండమాన్ నికోబార్ దీవులలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.

స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారొచ్చు..

వచ్చే వారం రోజుల్లో దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతం, అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో వరద ముప్పు పొంచి ఉన్న‌ట్లు సూచించింది. అరుణాచల్ ప్ర‌దేశ్‌, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో జూన్ 12 వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచించారు.

ఆ రాష్ట్రాల్లో వేడిగాలులు..

వాయ‌వ్య, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎండ‌లు మండుతూనే ఉన్నాయి. ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, ఒడిశాలలో వచ్చే వారం రోజులు తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
Advertisement