త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND vs AFG | 152 ర‌న్స్‌కే అఫ్గాన్ ఆలౌట్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే మాన‌వ్ సుతార్ స‌త్తా

IND vs AFG | త్రినేత్ర‌.న్యూస్‌: అరంగేట్ర స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్ (Manav Suthar) దెబ్బ‌కు అఫ్గానిస్థాన్ (IND vs AFG) కుదేలైంది. భార‌త్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు.

G

Cricket | Published On Jun 8, 2026, 12.29 pm IST

IND vs AFG | 152 ర‌న్స్‌కే అఫ్గాన్ ఆలౌట్‌.. డెబ్యూ మ్యాచ్‌లోనే మాన‌వ్ సుతార్ స‌త్తా
Advertisement

IND vs AFG | త్రినేత్ర‌.న్యూస్‌: అరంగేట్ర స్పిన్న‌ర్ మాన‌వ్ సుతార్ (Manav Suthar) దెబ్బ‌కు అఫ్గానిస్థాన్ (IND vs AFG) కుదేలైంది. భార‌త్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అఫ్గాన్ బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. 113/5తో మూడో రోజు ఆట‌ను ప్రారంభించిన అఫ్గ‌న్లు 156 ప‌రుగులకే ఆలౌట‌య్యారు. ర‌హ్మ‌త్ షా (60, 135 బాల్స్‌లో) మిన‌హా మిగిలిన బ్యాట‌ర్లంతా వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లే పెవీలియ‌న్‌కు చేరారు. దీంతో భార‌త్‌కు 412 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. భార‌త్‌పై హాఫ్ చేసిన‌ తొలి అఫ్గాన్ బ్యాట‌ర్‌గా ర‌హ్మ‌త్ నిలిచాడు.

కాగా, కేవ‌లం 35 ప‌రుగులే ఇచ్చి 6 వికెట్ల‌తో స‌త్తా చాటిన మాన‌వ్ సుతార్ ఓ ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే 5 వికెట్లు సాధించిన రెండో భార‌త బౌల‌ర్‌గా నిలిచాడు. ఇంత‌కుముందు 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా 5/71తో ఈ ఫీట్ అందుకున్నాడు.

తొలి ఇన్నింగ్‌లో 8 వికెట్ల న‌ష్టానికి 564 వ‌ద్ద డిక్లేర్ చేసిన భార‌త్‌.. అఫ్గాన్‌ను 156 ర‌న్స్‌కే క‌ట్ట‌డిచేసింది. దీంతో భారీ ఆధిక్యం సాధించిన టీమ్ ఇండియా.. అఫ్గాన్‌ను ఫాలో ఆన్ ఆడిస్తున్న‌ది. లంచ్ బ్రేక్ స‌మ‌యానికి ఫాలోఆన్‌లో అఫ్గాన్ 21/0 స్కోర్ చేసింది. ప్ర‌స్తుతం సెథిఖుల్లా అట‌ల్ (16), అబ్దుల్ మాలిక్ (2) క్రీజులో ఉన్నారు.

Advertisement
Advertisement