Bandi Bageerath | బండి భగీరథ్‌కు బెయిల్.. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశం
Bandi Bageerath | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Bandi Bageerath | త్రినేత్ర.న్యూస్ : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని, కేసులో సాక్షులుగా ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయొద్దని కోర్టు చెప్పింది. పోక్సో కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు. కోర్టు ఆదేశాలు అందిన వెంటనే చర్లపల్లి జైలు అధికారులు భగీరథ్‌ను విడుదల చేయనున్నారు.
ఇక భగీరథ్ తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై నమోదైన ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించానని.. ఈ క్రమంలో తనకు కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం





