Bakka Judson | రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : బక్కా జడ్సన్
Bakka Judson | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీఎం రేవంత్‌పై జడ్సన్ నిప్పులు చెరిగారు.
Bakka Judson | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీఎం రేవంత్‌పై జడ్సన్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టేరోజులు దగ్గరలో ఉన్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్ వెలుపల జడ్సన్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ తెస్తా అంటున్నాడు. ఈ నెల 26వ తేదీన ముంబై వెళ్లి రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాకు రేవంత్ రెడ్డి మీద పిటిషన్ ఇచ్చి వచ్చాను. తెలంగాణలో మనకు బ్యాంక్ ఇచ్చే అప్పుకంటే, రూ.15,139 కోట్ల అప్పు ఎక్కువ తెచ్చుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈరోజు తెలంగాణకు అప్పు ఇవ్వనంటుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ఇంత అప్పు తెచ్చి ఏం చేస్తున్నాడు? కొండూరులో రేడియల్ రోడ్డు కోసం రైతులను గదుల్లో బంధించి భూసేకరణ చేస్తున్నారు. రైతుల తరపున మాట్లాడితే 70 కిలోమీటర్లు తిప్పి నందిగామ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని బక్కా జడ్సన్ పేర్కొన్నారు.
ఈరోజు ఏ న్యూస్‌లో ఏం రావాలి, ఏం వేయాలని ఆంధ్రా వాడు చెప్తున్నాడు. మన తెలంగాణలో ఇంతమంది అనుభవం ఉన్న మీడియా ప్రతినిధులు ఉండగా, శ్రీరామ్ కర్రీ అనే ఆంధ్రా అతన్ని ఎందుకు పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి ఇవాళ 8 మంది అడ్వైజర్‌లను ఆంధ్రా నుండి తెచ్చిపెట్టుకున్నాడు, ఎందుకు ఇక్కడ లేరా? మూసీ బ్యూటిఫికేషన్ చేయరు, కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం ఇదంతా చేస్తున్నారని బక్కా జడ్సన్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



