త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravindra Kumar | ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు కేసీఆర్ రాజీనామా అడుగుతున్నడు

Ravindra Kumar | ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్టు సీఎం రేవంత్‌ కేసీఆర్ రాజీనామా అడుగుతున్నాడ‌ని.. సిగ్గుంటే ఆయ‌న్నే రాజీనామా చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. నిన్న న‌కిరేక‌ల్ స‌భ‌లో రేవంత్ మాట‌లు దుర్మార్గంగా ఉన్నాయ‌ని.. ఇక జీవతంలో ఆయ‌న మార‌డ‌న్నారు.

S

Telangana | Published On Sep 6, 2026, 3.12 pm IST

Ravindra Kumar | ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు కేసీఆర్ రాజీనామా అడుగుతున్నడు
Advertisement
  • సిగ్గు ఉంటే రేవంతే రాజీనామా చేయాలి
  • ఇక జ‌న్మ‌లో మార‌వ్ నువ్‌
  • సీఎం రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రుస‌రుస‌

Ravindra Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: ఆడ‌లేక మ‌ద్దెల ఓడు అన్న‌ట్టు సీఎం రేవంత్‌ కేసీఆర్ రాజీనామా అడుగుతున్నాడ‌ని.. సిగ్గుంటే ఆయ‌న్నే రాజీనామా చేయాల‌ని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. నిన్న న‌కిరేక‌ల్ స‌భ‌లో రేవంత్ మాట‌లు దుర్మార్గంగా ఉన్నాయ‌ని.. ఇక జీవతంలో ఆయ‌న మార‌డ‌న్నారు. వెయ్యి రోజుల్లో చేసిన‌వి చెప్పి, చేయ‌ని వాటిపై క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు. కేసీఆర్ రాజీనామా కోరుతూ చేసే ధర్నాలో సీఎం, మంత్రులు పాల్గొనడం అవివేకమ‌న్నారు. రాఖీ క‌ట్టిన కొండా సురేఖ‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసి పైగా కేటీఆర్ గురించి మాట్లాడ‌డ‌మా అని ఫైర‌య్యారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ నాయ‌కుల‌తో క‌లిసి నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రేవంత్ తీరుపై మండిప‌డ్డారు.

నిన్న సీఎం రెవంత్ రెడ్డి నకిరేకల్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం నల్లగొండ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. సభకు వచ్చిన వారు సీఎం ప్రసంగం తర్వాత నిరాశతో వెళ్లి పోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను వ్యక్తిగతంగా విమర్శించడానికే సీఎం మీటింగ్‌లు పెడుతున్నారు. సీఎం మాటలు దుర్మార్గంగా ఉన్నాయి. ఆయన ఇక జీవితంలో మారడు.

ప్రతిపక్ష నేత భద్రతకు 22 కోట్ల ఖర్చు అని రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌కు భద్రత రాజ్యాంగబద్దమైన బాధ్య‌త. రేవంత్ ఇచ్చేదేముంది? కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధ‌పడి తెలంగాణ తేకపోతే రేవంత్‌కు సీఎం పదవి ఎక్కడిది? కేసీఆర్ రైతు బీమా, కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేశారో రేవంత్ సమాధానం చెప్పాలి. ఫీ రీయింబ‌ర్స్ మెంట్ పథకాన్ని నిర్వీర్యం ఎందుకు చేశావ్? మిషన్ భగీరథ కింద రేవంత్ నీళ్లు కూడా ఇవ్వడం లేదు. ఉచిత కరెంటు 24 గంటలు ఎందుకు ఇవ్వడం లేదు? రేవంత్ మాటలు పెద్దవి.. చేతలు శూన్యం.

ఆటో కార్మికుల సంక్షేమం కోసం చెప్పినవి ఎందుకు చేయలేదు? బీసీలకు రిజర్వేషన్ పెంచుతానని ఎందుకు పెంచలేదు? మహిళలకు ఆర్థిక, రాజకీయ సాధికారికత కల్పించింది కేసీఆర్ యే. మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? రైతులకు నీళ్లు కూడా ఇవ్వని అసమర్థుడు రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారు. రైతులను ముంచుతున్నారు.

ప్రశ్నిస్తే సీఎం, కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేశారు. నల్లగొండకు రేవంత్ చేసిందేమి లేదు. కేసీఆర్ తెలంగాణ జాతి పిత. ఆయన మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం క్షమించరు అని ర‌వీంద్ర‌కుమార్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement